షాకింగ్ రీజన్ తో సాయి తేజ్ 6 నెలల బ్రేక్.!

టాలీవుడ్ మెగా యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన రీసెంట్ సినిమా “విరూపాక్ష” తో అయితే తన కెరీర్ లో సెన్సేషనల్ హిట్ ని అందుకోగా ఇక ఈ సినిమా తర్వాత అయితే తన మేనమామ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని తన సినిమాలో గెస్ట్ రోల్ లో చేసిన చిత్రం “బ్రో” తో అయితే మరో రిలీజ్ తో రాబోతున్నాడు.

మరి ఈ సినిమాపై ఇప్పుడు మంచి అంచనాలు ఉండగా ఈ చిత్రాన్ని అయితే దర్శకుడు సముద్రఖని తెరకెక్కిస్తున్నారు. కాగా ఇదిలా ఉండగా ఈ చిత్రాలు కన్నా ముందు తేజ్ అయితే ఓ ఊహించని ఘటన తన జీవితంలో ఎదుర్కొన్నాడు. రోడ్డు ప్రమాదానికి గురయ్యి ఆల్ మోస్ట్ చావు వరకు కూడా వెళ్లి వచ్చాడు తాను.

అయితే ఆ తర్వాత మళ్ళీ మునుపటిలా మాట్లాడ్డానికి మునుపటిలా నడుచుకోవడానికి చాలా శక్తిని ఆత్మవిశ్వాసాన్ని తెచ్చుకొని కోలుకోవాల్సి వచ్చింది. అయితే ఇప్పటికీ కూడా టెక్ పూర్తి స్థాయిలో కోలుకోలేదు. అయితే ఒక్క నటన మినహా తన శరీరంతో కష్టపడలసి వచ్చే సన్నివేశాల్లో ఇప్పటికీ తేజ్ నుంచి అయితే కొంచెం ఇబ్బంది కనిపిస్తుంది.

అయితే ఇప్పుడు బ్రో రిలీజ్ తర్వాత తేజ్ మొత్తం 6 నెలలు పాటు బ్రేక్ తీసుకుంటానకి చెప్పాడు. అయితే ఈ బ్రేక్ కి తన హెల్త్ పరంగా మాత్రమే కాకుండా తన ఫిట్నెస్ లెవెల్ పై కూడా మార్చాలని చూస్తున్నాడట. అలాగే తాను ఇప్పుడు ముందులా కూడా డాన్స్ చెయ్యలేకపోతున్నాను అని.

బ్రో లో మొన్న వచ్చిన సాంగ్ లో కూడా డాన్స్ సరిగ్గా చెయ్యలేకపోయాను నాకే నా డాన్స్ నచ్చలేదు. అందుకే ఈ గ్యాప్ లో మళ్ళీ డాన్స్ పై కూడా కేర్ తీసుకుంటాను అని తన కెరీర్ స్టార్టింగ్ లో ఎలా చేసేవాడినో అంతకు మించి బాగా చేసేందుకు ట్రై చేస్తాను అని తేజ్ క్లారిటీ ఇచ్చాడు.