మేనమామ చిరంజీవి పోలికలతో అలరిస్తున్న “సాయిధరమ్ తేజ్” తనదైన టాలెంట్‌తో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. వరుసగా ఫ్లాపులు వచ్చినా పుంజుకుని మారుతీ దర్శకత్వంలో వచ్చిన ‘ప్రతిరోజూ పండగే’ తో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు . తాజాగా తేజ్ నటించిన సినిమా ‘సోలో బ్రతుకే సో బెటర్’…డిసెంబర్ 25 తేదీన థియేటర్లలో విడుదలకు సిద్దమవుతుంది . కరోనా కారణం చేత థియేటర్లు మూతపడిన తర్వాత సినిమాలన్నీ ఓటిటి ప్లాట్ ఫామ్ లలో విడుదల చేస్తున్నారు. కరోనా సడలింపులు తర్వాత ఇటీవలనే థియేటర్ లు తిరిగి ప్రారంభమయ్యాయి . మూవీ విడుదలకి దగ్గరవుతుండటంతో ప్రొమోషన్స్లో దూసుకుపోతున్నాడు సాయిధరమ్ తేజ్.
తాజాగా ఒక మీడియా ఛానల్ లో ఇంటర్వ్యూ ఇస్తూ… సినిమా విశేషాల గురించి, తన పెళ్లి గురించి ఇంకా అనేక విషయాల గురించి మనసులో మాటలు బయటపెట్టాడు. అన్ని జాగ్రత్తలు తీసుకుని తమ సినిమాను ధైర్యం చేసి థియేటర్లో విడుదల చేస్తున్నట్లు సాయిధరమ్ తేజ్ తెలిపారు. అన్ని సినిమాలు ఓటిటి లో రిలీజ్ చేయలేమని, అలాగే ప్రేక్షకులు థియేటర్ మజాని కోల్పోయారని , తిరిగి ఆ మాజాని ఈ సినిమా ద్వారా పొందుతారని అన్నారు. ప్రేక్షకులని “సోలో బ్రతుకే సో బెటర్” మూవీ మొదటి నుండి చివరి వరకు కదలకుండా కూర్చో పెట్టగలదని , మంచి అనుభూతిని పంచుతుందని ఆయన తెలిపారు.
తన పెళ్లి గురించి మాట్లాడుతూ… ఇప్పుడు నేను సింగిల్ గా హ్యాపీ గా ఉన్నాను, ఇంకో ఆరు సంవత్సరాలు ఇలానే హ్యాపీ గా ఉందామనుకుంటున్నాను. ఆ తర్వాత పెళ్లి చేసుకోక తప్పదని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతానికి తెలుగు సినిమాల మీదనే తన ఆసక్తి ఉందని, తెలుగు సినిమాలు చేస్తూనే నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకోవాలని అన్నాడు. తెలుగు , తమిళ్, మలయాళం మరియు కన్నడ భాషలలో నటించిన తర్వాతనే మంచి స్క్రిప్ట్ కుదిరితే హిందీ లో కూడా చేస్తానని యాంకర్ అడిగిన ఒక ప్రశ్నకి సమాధానమిచ్చాడు.