Sagar k Chandra: మరోసారి మెగా హీరో సినిమా అవకాశాన్ని దక్కించుకున్న సాగర్ కె చంద్ర!

Sagar k Chandra: భీమ్లా నాయక్ వంటి విభిన్నమైన కథతో ప్రేక్షకులకు ముందుకు వచ్చి ఎంతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు డైరెక్టర్ సాగర్ కే చంద్ర. ఈయన గతంలో అప్పట్లో ఒకడుండేవాడు అనే చిత్రం ద్వారా మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుని ఏకంగా పవన్ కళ్యాణ్ సినిమా అవకాశాన్ని దక్కించుకున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో నిర్మాతలు, హీరోలు ఈయనతో సినిమా చేయడానికి ఎదురుచూస్తున్నారు. అయితే సాగర్ కే చంద్ర మరోసారి మరో మెగాహీరో అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది.

సాగర్ కే చంద్ర తన తదుపరి ప్రాజెక్టును మెగా హీరో వరుణ్ తేజ్ తో చేయనునట్లు తెలుస్తోంది.గతంలోనే సాగర్ ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమా తరువాత సాగర్ వరుణ్ తేజ్ కి కథ వివరించాడు. ఈ సినిమా స్క్రిప్ట్ పనులన్నింటినీ కూడా పూర్తి చేసి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేశారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల వరకే ఆగిపోయింది. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకోవడం సాగర్ తిరిగి ఈ ప్రాజెక్టు వరుణ్ తో చేయనున్నట్లు తెలుస్తోంది.

గతంలో వరుణ్ కి వివరించిన కథను ప్రస్తుతం సెట్స్ పైకి తీసుకురావాలని ఆలోచనలో వరుణ్ తేజ్ ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన చేయనున్నారు. ప్రస్తుతం వరుణ్ తేజ్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 3, గని సినిమాల ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. త్వరలోనే గని సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.