హీరో రాజశేఖర్‌ పరువుదీసేశారు.. ఇమిటేషన్‌తో ఇరగ్గొటేసిన సద్దాం

Saddam Imitates Rajasekhar In Bomma Adirindhi

బొమ్మ అదిరింది షోలో సద్దాం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాడు. పటాస్ షోలో గల్లీ బాయ్స్ పేరిట ఫేమస్ అయిన సద్దాం.. అదిరింది షోలోనూ రచ్చ చేశాడు. ఆ మధ్య సద్దాం, హైపర్ ఆది మధ్య కోల్డ్ వార్ నడిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రికార్డుల పేరిట ఒకరిపై ఒకరు పరోక్షంగా పంచ్‌లు వేసుకున్నారు. జబర్దస్త్‌కు ఆది.. అదిరిందికి సద్దాం అనే రేంజ్‌లో గొడవలు జరిగాయి. యూట్యూబ్ రికార్డులు, వ్యూస్ గురించి హైపర్ ఆది సద్దాం మధ్య మాటలు తూటాలు గట్టిగానే పేలాయి.

Saddam Imitates Rajasekhar In Bomma Adirindhi
Saddam Imitates Rajasekhar In Bomma Adirindhi

అయితే వాటి లెక్కలో హైపర్ ఆది అందనంత ఎత్తులో ఉంటాడని అందరికీ తెలిసిందే. కానీ సద్దాం కూడా తన దైన శైలిలో కామెడీ చేస్తూ అందరినీ నవ్విస్తున్నాడు. మరీ ముఖ్యంగా ఇమిటేషన్స్‌లో గల్లీ బాయ్స్ టీం వారవారానికి దుమ్ములేపుతోంది. బొమ్మ అదిరిందిలో ఇమిటేషన్ స్కిట్స్ మాత్రం ఓ లెవెల్‌లో పేలుతోన్నాయి. మొదటగా వైఎస్ జగన్‌ను ఇమిటేట్ చేశారు. అది విపరీతంగా పాపులర్ అవ్వడం అభిమానులు బెదిరించడం కూడా జరిగింది.

ఆ తరువాత ఓంకార్, పోసాని, శివ శంకర్ మాస్టర్ ఇలా ఎంతో మందిని ఇమిటేట్ చేశారు. తాజాగా హీరో రాజశేఖర్‌ను దారుణంగా వాడేశారు. రాణి శేఖర్ అంటూ పేరు మార్చుకున్న సద్దాం.. రాజశేఖర్ మ్యానరిజాన్ని అనుకరించాడు. రాజ శేఖర్ బయట మీడియాతో ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడి, తెలుగు కూడా సరిగ్గా పలకడం రాదని పరోక్షంగా చెప్పేశారు. మొత్తానికి ఈ వారం రాజశేఖర్ ఇలా రోస్ట్ చేసినట్టు కనిపిస్తోంది. ఈ మేరకు తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో విష్ణుప్రియ కూడాబాగానే క్లిక్ అయింది.