లీక్స్ లో ప్రభాస్ నే గుర్తు పట్టలేకపోతున్న ఫ్యాన్స్..!

ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోస్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా ఒకడు. అయితే ప్రభాస్ తన లుక్స్ పరంగా లాస్ట్ టైం బాహుబలి మినహా ఇంకే చిత్రంలో కూడా ఫ్యాన్స్ కి ఫీస్ట్ ఇవ్వలేదు. రాధే శ్యామ్ లో అక్కడక్కడా పర్వాలేదు కానీ సాహో మొన్న ఆదిపురుష్ చిత్రాలలో కూడా పాత ప్రభాస్ అయితే కనిపించలేదు.

అయితే ఇప్పుడు నటిస్తున్న ప్రభాస్ చిత్రాలులో దర్శకుడు మారుతీ తో చేస్తున్న ప్రాజెక్ట్ కూడా ఒకటి. అయితే ఇది కూడా గ్రాండ్ స్కేల్ లోనే తెరకెక్కుతుంది కానీ ఈ సినిమా నుంచి ఇటీవల బాగా లీక్ లు బయటకి వస్తున్నాయి. అయితే లేటెస్ట్ గా డైరెక్ట్ ప్రభాస్ పైనే కొన్ని ఫోటోలు సెట్స్ నుంచి లీక్ అయ్యాయి.

అయితే అక్కడ ఉన్నది ప్రభాస్ అనే తెలుస్తుంది కానీ ఆ హెయిర్ స్టయిల్ కానీ ముఖం చూస్తే ఇది ప్రభాసేనా అని అనుమానం కలుగుతుంది. దీనితో ఫ్యాన్స్ కూడా ముఖం వరకు ప్రభాస్ అని గుర్తు పట్టలేకపోతున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మధ్య ఇదే వైరల్ గా మారింది.

ప్రభాస్ మొహాన్ని గుర్తు పట్టలేక తన కాళ్ళు వేళ్ళు చూసి ఇది ప్రభాసే అని అనుకుంటున్నా పరిస్థితి లోకి తాము వచ్చేసారు. మరి దీనితో ప్రభాస్ ఎలా మారిపోయాడో అర్ధం చేసుకోవచ్చు. కానీ కొంతమంది ఫ్యాన్స్ మాత్రం బాగానే గుర్తు పట్టి వింటేజ్ ప్రభాస్ కనిపిస్తున్నాడని అంటున్నారు. ప్రస్తుతానికి అయితే పరిస్థితి ఎలా మారిపోయింది.