విషాదం : “కేజీఎఫ్” మరో నటుడు మృతి.!

ఈ ఏడాది ఇండియన్ సినిమా దగ్గర అయితే బిగ్గెస్ట్ గ్రాసర్ అయినటువంటి చిత్రం ఏదన్నా ఉంది అంటే ఆ చిత్రం “కేజీఎఫ్ చాప్టర్ 2” అనే చెప్పాలి. భారీ మొత్తంలో 1200 కోట్లకి పైగా గ్రాస్ ని కొల్లగొట్టిన ఈ చిత్రంలో రాకింగ్ స్టార్ యాష్ బాస్ హీరోగా నటించగా దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.

మరి ఈ సినిమా రిలీజ్ అయ్యిన తర్వాత ఈ ఏడాది మే లో ఈ చిత్రంలో నటించిన ముఖ్యంగా “మాన్స్టర్” డైలాగ్ ఫేమ్ మోహన్ జునేజా అనారోగ్యంతో కన్ను మూసారు. అయితే ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ బయటకి వచ్చింది. కేజీఎఫ్ 1 మరియు చాప్టర్ 2 లో కూడా కనిపించిన నటుడు కృష్ణ జి రావు అయితే అనారోగ్యంతో కన్ను మూశారని తెలిసింది.

మరి చాప్టర్ 1 లో అయితే ఈ తాత పాత్రపైనే రాకీ భాయ్ నుంచి భారీ ట్రీట్ ఆడియెన్స్ కి వచ్చింది. అలాగే నెక్స్ట్ చాప్టర్ 2 లో కూడా ఆయనపై మంచి పాట కూడా రాసారు. మరి ఇలాంటి నటుడు అయితే కన్ను మూయడం నిజంగా విషాదకరం. అలాగే ఈ విషాద వార్తతో అయితే చిత్ర యూనిట్ కూడా దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది.

ఇంకా ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించగా రవీనా టాండన్ కీలక పాత్రలో నటించారు. అలాగే బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ అధీరా గా నటించగా రావు రమేష్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.