“సలార్” టీజర్ రన్ టైం..ఎన్ని దేశాల్లో రిలీజ్ అంటే.!

ఇప్పుడు పాన్ ఇండియా సినిమా అంతా ఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ “సలార్” కోసం తెలిసిందే. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రాన్ని అయితే సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండగా దాదాపు ఏడాదిన్నరగా ఎదురు చూస్తున్న క్రేజీ టీజర్ కట్ ని మేకర్స్ ఎట్టకేలకు ఈ జూలై 6న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు.

అయితే ఈ మాసివ్ ప్రాజెక్ట్ టీజర్ ని ఇండియాలో తెల్లవారు జామున 5 గంటల సమయంలో రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేయగా ఈ క్రేజీ టీజర్ పై మరిన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఇపుడు వినిపిస్తున్నాయి. కాగా ఈ టీజర్ అయితే సుమారు నిమిషంన్నర రన్ టైం తో రాబోతున్నట్టుగా తెలుస్తుంది.

అయితే ఈ టీజర్ ని మేకర్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ మరో అంశం ఏమిటంటే వరల్డ్ వైడ్ ఒకే టైం కి కాకుండా ఒకో దేశంలో ఒక్కో సమయంలో సలార్ టీజర్ విడుదల కాబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి ఇండియాతో పాటుగా అయితే సలార్ టీజర్ అరేబియా, యూఎస్, యూరోప్, యూకే, రష్యా, అస్ట్రేలియా, న్యూజిలాండ్ అలాగే ఆఫ్రికా దేశాల్లో అయితే ఒకో సమయంలో రిలీజ్ కాబోతున్నట్టుగా లిస్ట్ వదిలారు.

దీనితో ఈ లిస్ట్ వైరల్ గా మారింది. ఇక ఈ భారీ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా రవి బాసృర్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే కేజీఎఫ్ టీం ఈ సినిమాని నిర్మాణం వహిస్తున్నారు. ఈ సెప్టెంబర్ లో ఈ చిత్రం వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతుంది.