రూ. 5 కోట్ల కొత్త కారు కొన్న జూనియర్ ‘ఎన్టీఆర్’ !

తెలుగు హీరోలకు కార్ల పిచ్చి బాగానే ఉంది. మార్కెట్‌లోకి కొత్త కారు వచ్చిందంటే చాలు.. తమ వాకిట్లో ఉండాలనుకునే వాళ్లు చాలా మందే ఉన్నారు. సినిమా స్టార్స్ తమకి ఇష్టమైన ఖరీదైన కార్లు కొనడంలో ఆనందం వెతుక్కుంటారు. అలాంటి స్టార్స్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. ఎన్టీఆర్ లగ్జరీ ఫీచర్లతో పాటు సేఫ్టీకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాడు.

ఈయన దగ్గర కార్స్ కలెక్షన్స్ చాలానే ఉంది. ఎప్పుడూ ఒకే కారులో తిరగడం యంగ్ టైగర్‌కు అస్సలు నచ్చదు. అందుకే ఎప్పటికప్పుడు ట్రెండ్‌ను బట్టి కార్లు మారుస్తూనే ఉంటాడు ఈయన. అయితే కొంతకాలంగా కార్ మార్చని ఎన్టీఆర్.. ఇప్పుడు మాత్రం అదిరిపోయే కొత్త కార్ తీసుకుంటున్నాడు. ఇండియాలో లేకపోతే ఇటలీ నుంచి ఈ కారును దిగుమతి చేయిస్తున్నాడు జూనియర్. ఆ కారు పేరు లంబోర్ఘిని ఉరుస్.. ఈ మోడల్ కారును ఆయన బుక్ చేసాడు. దీని ఖరీదు 5 కోట్ల వరకు ఉంటుందని అంచనా. అత్యంత విలాసవంతమైన ఈ కారు ఇటలీ నుంచి ఇండియాకు ప్రత్యేకంగా ఎన్టీఆర్ కోసం త్వరలోనే చేరుకుంటుంది.

అంతే కాదు ఆల్ సర్ఫేస్ క్వాలిటీ కార్. అంటే కేవలం రోడ్ల మీద మాత్రమే కాదు.. దట్టమైన ఎడారి ప్రాంతంలో కూడా అదిరిపోయే రైడ్ చేయొచ్చు. దాంతో పాటు కొండ ప్రాంతంలో కూడా ఈ కారు ఎలాంటి సమస్య లేకుండా ముందుకు దూసుకుపోతుంది. ఎంత స్పోర్ట్స్ కారు అయినా కూడా అన్నిచోట్లా అలా చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే కోట్లలో రేటు కదా.. చిన్న గీటు పడినా దాని నష్టం లక్షల్లో ఉంటుంది. అందుకే జాగ్రత్తగానే ఉంటారు. ఇలాంటి కారు హైదరాబాద్ లో ఎవరికీ లేదు. అందుకే ఎన్టీఆర్ మోజుపడి తెప్పిస్తున్నాడట. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటిస్తున్నాడు.