RRR : ఏ బిడ్డ ఇది నా అడ్డా అంటున్న ఆర్ఆర్ఆర్…ఎక్కడో తెలుసా..?

RRR: రాజమౌళి మాస్టర్ మైండ్ తో తీసిన చిత్రం త్రిబుల్ ఆర్ ఇక ఈ చిత్రం ఈరోజు విడుదలయి సంచలనాలు సృష్టిస్తోంది. ఎక్కడ చూసిన ఆర్ఆర్ఆర్ ముచ్చటే. ఇక ఈ సినిమా ప్రపంచం వ్యాప్తంగా విడుదలయి అన్నిచోట్లా రచ్చ చేస్తోంది. ఇక చరణ్,ఎన్టీఆర్ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అటు రేటింగ్స్ లో కూడా దూసుకుపోతోంది.

మరో ఐదేళ్లైనా ఎవ్వరూ అందుకోలేని స్టేజ్‌ను సెట్ చేసింది. అయితే ఈ రికార్డును సెట్ చేసింది ఇండియా లో కాదు… అవుట్ ఆఫ్‌ ఇండియా అమెరికాలో..! ఎస్! ద మోస్ట్ ఆంటిసిపేటెడ్‌ పాన్ ఇండియన్ మూవీ ఆర్ఆర్ఆర్.. బాహుబలి రికార్డును బద్దలు కొట్టేసింది. అమెరికాలో ఈ సినిమా 1000 మల్టీప్లెక్స్‌లలో రిలీజ్‌ అవ్వడమే వండర్ అనుకుంటే… జెస్ట్ అడ్వాన్స్‌ బుకింగ్స్‌లోనే 2.5 మిలియన్ డాలర్లు వసూల్ చేసి మరో నెవర్ ఎక్స్‌పెక్టెడ్‌ వండర్‌ను క్రియేట్‌ చేసింది. అంతేకాదు అమెరికా గడ్డనే తన అడ్డాగా మార్చుకుని మరీ… యూఎస్‌లో నెంబర్ 1 ఫిల్మ్ గా లిస్టవుట్‌ అయింది.

ఇక ఇండియా లోనూ ఆర్ఆర్ఆర్ రికార్డులు సృష్టిస్తోంది. బాహుబలి సెట్ చేసిన రికార్డులను ఒకరోజులోనే బద్ధలుకొట్టింది. చరిత్ర తిరగరాస్తూ ఆర్ఆర్ఆర్ ముందు ఆర్ఆర్ఆర్ తర్వాత అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. ఇంకా మొదటి వారం తర్వాత ఎంత వసూలు చేసి అద్భుతాలు సృష్టిస్తుందో చూడాలి.