ఆర్ ఆర్ ఆర్ నిర్మాతకి అప్పుడే లాభాలు మొదలు ..?

డివివి దానయ్య.. టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్. ఎప్పడి నుంచో సినిమా రంగంలో నిర్మాతగా కొనసాగుతున్న దానయ్య జంబలకిడి పంబ సినిమా తో నిర్మాతగా మారారు. ఆ తర్వాత నుంచి భాగస్వామ్యంలో సినిమాలు నిర్మిస్తూ వస్తున్న దానయ్య ఆ తర్వాత డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ ని స్థాపించి సోలో నిర్మాతగా భారీ సినిమాలని నిర్మిస్తున్నారు. దానయ్యకి డేరింగ్ ప్రొడ్యూసర్ గా ఇండస్ట్రీలో మంచి పేరుంది. ఒక ప్రాజెక్ట్ టేకప్ చేశాడంటే ఎటువంటి పరిస్థితుల్లోను ఆ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేస్తాడు.

41 Cr Sensational deal for RRR

అయితే గత కొన్ని రోజులుగా అందరూ దానయ్య మీద రక రకాల కామెంట్స్ చేస్తున్నారు. కారణం ఇప్పుడు డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో ఆర్ ఆర్ ఆర్ నిర్మిస్తున్నారు. అయితే దాదాపు ఈ సినిమా సంవత్సరం పోస్ట్ పోన్ అయింది. సినిమా ప్రారంభం అయినప్పటి నుంచి రక రకాల సమస్యలు తలెత్తిన సంగతి తెలిసిందే. దానికి తోడు కరోనా గట్టి దెబ్బ కొట్టింది. దాంతో ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ అనుకున్న సమయానికి అవక రెండుసార్లు పోస్ట్ పోన్ అయింది.

ఎట్టకేలకి ఈ నెల 5 నుంచి చిత్రీకరణ మొదలైంది. దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ భారీ పాన్ ఇండియన్ సినిమాలో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ పోరాట యోధులుగా నటిస్తున్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రాం చరణ్ నటిస్తుండగా కొమరం భీమ్ గా ఎన్.టి.ఆర్ నటిస్తున్నారు. ఇప్పటికే చరణ్ వీడియో టీజర్ సినిమాపై భారీ అంచనాలు పెంచగా ఈ నెల 22 న కొమరం భీమ్ పాత్రని రివీల్ చేసేందుకు రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు.

కాగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా బిజినెస్ అప్పుడే మొదలైపోయిందని సమాచారం. 400 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న ఆర్ ఆర్ ఆర్ కి సగం అంటే 200 కోట్ల వరకు డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ కి ఆఫర్ వచ్చినట్టు తెలుస్తుంది. దీన్ని బట్టి చూస్తే ఆర్ ఆర్ ఆర్ ఖచ్చితంగా ఊహించని స్థాయిలో బుజినెస్ అవనుందని నిర్మాత దానయ్య కి లాభాలు మొదలవబోతున్నాయని చెప్పుకుంటున్నారు.