RRR Pre Invite Poster: నెట్టింట వైరల్ అవుతున్న‘ఆర్‌ఆర్‌ఆర్’ ప్రీ రిలీజ్ ఇన్వైట్ పోస్టర్‌.!

RRR Pre Invite Poster: దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై అభిమానులు చాలా ఆసక్తిగా ఉన్నారు. ఈ చిత్రంలో ప్రముఖంగా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలు పోషించారు. సినిమా విడుదల దగ్గర పడటంతో స్టార్స్ అంతా సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు. అయితే ఇప్పటి వరకు విడుదలైన ట్రైలర్, సాంగ్స్, ఫొటోస్‌తో ఈ సినిమాపై అంచనాలు భారీగానే నెలకొన్నాయి.

అయితే ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి, అభిమానులు ఈ చిత్రం థియేటర్లలో విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సందర్భంగా సినీ విమర్శకుడు తరణ్ ఆదర్శ్ తన ట్విట్టర్‌లో ఖాతాలో ‘RRR’ ప్రీ-ఈవెంట్ పోస్టర్‌ను పంచుకున్నారు.

తరణ్ ఆదర్శ్ ఈ పోస్టర్‌ను పంచుకుంటూ, “దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం తిరువనంతపురం చేరుకున్నారు. ఈ ఈవెంట్ పోస్టర్‌లో నటీనటులందరినీ చూపించారు. ఈ పోస్టర్‌లో ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని ఆరు పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లకు స్థానం కల్పించారు. ఈ సినిమా జనవరి 7న సినిమా థియేటర్లలో విడుదల కానుంది’ అని అందులో రాసుకొచ్చాడు.
.
‘ఆర్‌ఆర్‌ఆర్’ ‘స్టోరీ ఇద్దరు స్వాతంత్య్ర సమరయోధులు అల్లూరి సీతారామ రాజు, కొమరం భీమ్ కల్పిత కథ ఆధారంగా రూపొందించారు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ అద్భుతమైన యాక్షన్‌లో కనిపించనున్నారు. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగాయి.

ఆర్‌ఆర్‌ఆర్ విడుదలకు ముందు, ఆర్‌ఆర్‌ఆర్’ మేకర్స్ సినిమా ప్రేక్షకుల కోసం ఒక మెగా ఈవెంట్‌ను ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ మెగా ఈవెంట్‌లో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌ ప్రత్యేక అతిథిగా కనిపించనున్నట్టు సమాచారం. దీంతో పాటు ప్రేక్షకులతో చాట్ సెషన్ కూడా చేయనున్నారు. రీసెంట్‌గా ఆర్‌ఆర్‌ఆర్ టీమ్ బిగ్ బాస్ 15లో వీకెండ్ ఎపిసోడ్ లో సినిమా ప్ర‌మోష‌న్ కోసం సందడి చేసింది. ఆ సందర్భంలో షో హోస్ట్ సల్మాన్ ఖాన్‌తో ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్ చాలా సరదాగా గడిపింది.