Sandeep Vanga: ఆర్ఆర్ఆర్ ఒక్కసారి కాదు… 3,4 సార్లు చూడాల్సిందే: సందీప్ వంగా షాకింగ్ కామెంట్స్!

Sandeep Vanga: అర్జున్ రెడ్డి అప్పట్లో ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆ ఒక్క సినిమాతోనే హీరో విజయ్ దేవరకొండ స్థాయి ఎక్కడికో వెళ్ళిపోయింది. మొదట్లో వివాదాలకు దారితీసినా, ఆ తర్వాత మాత్రం భారీ విజయాన్ని అందుకొని అందరిని ఆశ్చర్య పరిచింది.

ఇక ఈ సినిమా డైరెక్టర్ ఎవరో తెలుసా సందీప్ వంగా. తెలుగులోనే కాకుండా హిందీలోనూ అర్జున్ రెడ్డి ఊహించిన దానికంటే ఎక్కువ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకావడంతో ఈ డైరెక్టర్ ఇమేజ్ కూడా పెరిగిపోయింది. అయితే తాజా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ మూవీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఏ స్థాయిలో ఉంటుందని ప్రేక్షకులు భావించారో అంతకు మించిన స్థాయిలో సినిమా ఉందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇకపోతే ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ అయిన నేపథ్యంలో సందీప్ వంగా ఈ సినిమాపై కొన్ని ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాను ఇప్పటికే రెండు సార్లు చూశానన్న సందీప్ రెడ్డి, ముచ్చటగా మూడోసారి కూడా చూడబోతున్నాడట. తానే కాదూ ఈ సినిమాని ప్రతి ఒక్కరూ కనీసం రెండు సార్లు చూడాలనీ, మూడోసారీ, నాలుగోసారి కూడా చూడాలనీ ఆయన పిలుపునిచ్చారు. ఇక విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. ఐతే ఈ మూవీని 3, 4 సార్లు చూడాలన్న విషయాన్ని గమనిస్తే, పెరిగిన టికెట్ ధరల దృష్ట్యా సామాన్య ప్రజలకు ఒక్కసారి సినిమాను చూడడమే కష్టంగా మారింది. అలాంటిది ఏకంగా మూడు, నాలుగు సార్లు చూడడం అనేది జరిగే పనేనా అని కొందరు ప్రశ్నిస్తున్నారు.