టాలీవుడ్ బిగ్గెస్ట్ మాస్ హీరోస్ లో ఒకరైన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన లేటెస్ట్ భారీ హిట్ చిత్రం “ఆర్ ఆర్ ఆర్” కోసం పాన్ ఇండియా కానీ వరల్డ్ ఆడియెన్స్ కి గాని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఇప్పటికీ వరల్డ్ వైడ్ భారీ రెస్పాన్స్ తో దూసుకెళ్తున్న ఈ చిత్రం కొన్ని నెలల కితం జపాన్ దేశంలో కూడా రిలీజ్ అయ్యి అక్కడ ఇండియాస్ హైయెస్ట్ గ్రాసర్ గా ఇండస్ట్రీ హిట్ అయ్యింది. ఇక ఇప్పటికీ కూడా అక్కడ ఈ చిత్రం భారీ వసూళ్లతో ఇంకా సాలిడ్ ఫుట్ ఫాల్స్ తో దూసుకెళ్తుంది.
ఇక లేటెస్ట్ గా అయితే ఈ చిత్రం అక్కడ ఈ జనవరి 17 నాటికి 3,69,130 ఫుట్ ఫాల్స్ ని సొంతం చేసుకుందట. అంతే కాకుండా ఇక అక్కడ ఈ చిత్రం ఇక నుంచి డాల్బీ సినిమాలో కూడా రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. ఇక ఇక్కడ నుంచి సినిమాకి వసూళ్లు మరింత పెరుగుతాయని చెప్పాలి.
ప్రస్తుతానికి మాత్రం ఈ చిత్రం జపాన్ లో 88 రోజుల థియేట్రికల్ రన్ ని కంప్లీట్ చేసుకొని 100 రోజుల దిశగా వెళ్తుంది. దీనితో ఈ చిత్రం హవా మాత్రం మామూలుగా ఉండదని చెప్పాలి. ఇంకా ఈ సినిమాలో ఒలీవియా మోరిస్, లు హీరోయిన్స్ గా నటించ సంగీత దర్శకునిగా ఎం ఎం కీరవాణి వర్క్ చేశారు అలాగే రీసెంట్ గానే తనకి ఇంటర్నేషనల్ అవార్డు కూడా వచ్చింది.
#RRRMovie's roaring run continues in Japan!
369,130 admissions in 88 days, as of Jan 17th, 2023. ❤️🔥❤️🔥#RRR releasing in @DolbyCinema format across Japan tomorrow!! #RRRinJapan 💥💥 pic.twitter.com/rMptb5xtj7
— RRR Movie (@RRRMovie) January 19, 2023