దర్శక శిఖరం ఎస్ ఎస్ రాజమౌళి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి ఇద్దరు మాస్ హీరోస్ తో చేసిన మాస్ మల్టీ స్టారర్ చిత్రం ట్రిపుల్ ఆర్(RRR) కోసం అందరికీ తెలిసిందే. భారీ వసూళ్లను కొల్లగొట్టిన ఈ చిత్రం రిలీజ్ అయ్యి ఇపుడు 70 రోజులకి చేరుకుంది.
మరో 50 రోజుల తర్వాత ఓటిటి లో రిలీజ్ అయ్యిన ఈ చిత్రం థియేటర్స్ లో మించి ప్రపంచ స్థాయిలో ఓ రేంజ్ లో గుర్తింపు తెచ్చుకుంటుంది. అయితే ఈ చిత్రం హిందీలో నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కాగా సౌత్ ఇండియా భాషల్లో జీ 5 లో విడుదల అయ్యింది.
అయితే ఈ చిత్రం ఇప్పుడు జీ 5 లో మాత్రం ఇంకా దుమ్ము లేపే రెస్పాన్స్ తోనే కొనసాగుతుందట. గత మూడు వారాల కితం వరల్డ్ వైడ్ నెంబర్ 1 స్థానంలోకి ట్రెండింగ్ లో వచ్చిన ఈ చిత్రం ఇప్పటికీ ఇదే ఫస్ట్ ప్లేస్ లో ట్రెండ్ అవుతూ నిలిచిందట. దీని బట్టి ఓటిటి లో కూడా ఈ సినిమా భారీ హిట్ అయ్యిందని చెప్పాలి.
ఇంకా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటించగా ఒలీవియా మోరిస్ ఎన్టీఆర్ సరసన నటించింది. అలాగే ఎం ఎం కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య సుమారు 500 కోట్ల వ్యయంతో నిర్మించారు.
Magnum opus #RRR Rampage 🔥💯 Trending #1 Worldwide since 3 weeks!
▶️https://t.co/lK54zHAusz#RRR streaming in Telugu, Tamil, Kannada & Malayalam.#RRRonZEE5 #RRRMOVIE#RRRoaringonZEE5 #TrendingonZEE5 #ZEE5RRRampage@ssrajamouli @tarak9999 @AlwaysRamCharan @mmkeeravaani pic.twitter.com/2AePQQSmOt
— ZEE5 Telugu (@ZEE5Telugu) June 4, 2022