RRR: దీపావళి గిఫ్ట్ అదిరిపోయింది.. ఫ్యాన్స్ కు ఇంత సర్ ప్రైజ్ ఇచ్చారేంటి?

RRR movie diwali gift revealed

ఆర్ఆర్ఆర్… ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. యావత్ భారత్ ఆర్ఆర్ఆర్ సినిమా గురించే చర్చిస్తోంది. సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో వస్తున్న సినిమా ఇది కావడంతో సినీ ప్రేమికుల్లో ఆర్ఆర్ఆర్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

RRR movie diwali gift revealed
RRR movie diwali gift revealed

ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా దూసుకెళ్తోంది. ఇప్పటికే అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ ఫస్ట్ లుక్ టీజర్, కొమురం భీమ్ గా జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ టీజర్ విడుదలైన విషయం తెలిసిందే.

అయితే.. దీపావళి పండుగ సందర్భంగా ఆర్ఆర్ఆర్ టీమ్ నుంచి ఫ్యాన్స్ కు భలే సర్ ప్రైజ్ ఇచ్చారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి.. ముగ్గురు కలిసి కూర్చొని సరదాగా కాసేపు ముచ్చటించారు. దీనికి సంబంధించిన ఫోటోలను మూవీ యూనిట్ ట్విట్టర్ లో పంచుకుంది.

రామ్ చరణ్, ఎన్టీఆర్.. ఇద్దరూ తెల్లటి దుస్తులు ధరించి… దీపావళి సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నట్టు కనిపించారు. పక్కనే కూర్చున్న రాజమౌళి… వాళ్లిద్దరికీ ఏదో చెబుతున్నట్టుగా ఉంది ఓ ఫోటో. మరోవైపు.. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ ఫోటోలకు ఫోజులిచ్చారు.