ఓటిటిలో వండర్స్ నమోదు చేస్తున్న “RRR” సినిమా..!

Twitter Review On RRR Movie

ఈ ఏడాదికి ఇండియన్ సినిమా దగ్గర భారీ హిట్స్ చాలానే రావొచ్చు ఏమో కానీ మన తెలుగు సినిమా ట్రిపుల్ ఆర్(RRR) ప్రపంచ వ్యాప్తంగా అందుకుంటున్న ఆదరణను మ్యాచ్ చెయ్యడం అనేది ఇప్పుడప్పుడే మరో భారతీయ సినిమాకి సాధ్యం అయ్యే పని కాదని చెప్పాలి.

ఆ రేంజ్ లో ఈ సినిమా ఇప్పుడు గ్లోబల్ గా భారీ క్రేజ్ ని సంపాదించుకుంది. మెగాపవర్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ క్రేజీ మల్టీ స్టారర్ కం భారీ ఏక్షన్ ఫీస్ట్ థియేటర్స్ తర్వాత ఓటిటి లో వచ్చాక మరింత స్థాయిలో పెరిగింది.

ప్రపంచ దిగ్గజ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ రిలీజ్ అయ్యిన ఈ చిత్రం ఇప్పుడు అనేక దేశాల ప్రజల నుంచి ఆదరణ అందుకోగా ఇప్పుడు మళ్ళీ వండర్స్ నమోదు చేసినట్టుగా చిత్ర యూనిట్ చెబుతుంది. విడుదల అయ్యిన మూడు నాలుగు వారాల పాటుగా ఆల్ టైం నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవ్వగా..

ఇప్పుడు 7వ వారానికి వచ్చిన ఈ చిత్రం గత రెండు వారాల కన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువ వ్యూ హావర్స్ ని నమోదు చేసినట్టుగా తెలుపుతుంది. అంటే నెట్ ఫ్లిక్స్ లో అసలు ఈ సినిమా ని ప్రేక్షకులు ఏ రేంజ్ లో చూస్తున్నారో మనం అర్ధం చేసుకోవాలి. దీనిపై చిత్ర యూనిట్ ప్రూఫ్ కూడా పెట్టి తమ సినిమా అందుకుంటున్న ఘనతను తెలియజేసారు.