RRR:ఆర్ఆర్ఆర్ సరికొత్త రికార్డు..ఆఫ్రికా దేశాల్లో తెలుగు సినిమా విడుదల..?

 

RRR:దర్శకధీరుడు రాజమౌళి, ఎన్టీఆర్ ,రామ్ చరణ్ లతో తీసిన సినిమా ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమాను మార్చి 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి.దీంతో ప్రమోషన్ కార్యక్రమాలు చిత్రబృందం చాలా చురుగ్గా చేస్తోంది. ప్రమోషన్ లో భాగంగా రాజమౌళి ఎన్టీఆర్ రామ్ చరణ్ ముగ్గురు ఇంటర్వ్యూ లకు బిజీగా ఉన్నారు.ఆర్ఆర్ఆర్’ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా భారీగా రిలీజ్ చేస్తున్నారు.

ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల కావడానికి ముందే సరికొత్త రికార్డ్ ని క్రియేట్ చేసింది . ఆఫ్రికా ఖండంలో మామూలుగా తెలుగు సినిమాలు పెద్ద గావిడుదల అవ్వవు.సౌత్ ఆఫ్రికాలో మాత్రమే చాలా అరుదుగా రిలీజ్ అవుతుంటాయి. ఆఫ్రికా ఖండంలో సౌత్ ఆఫ్రికాలో మాత్రమే తెలుగు వాళ్ళు, భారతీయులు అధికంగా ఉంటారు. దీంతో కొన్ని సినిమాలు అప్పుడప్పుడు అక్కడ రిలీజ్ అవుతుంటాయి.


అయితే ఆర్ ఆ సినిమా మాత్రం ఇందుకు భిన్నంగా సౌత్ ఆఫ్రికా లోనే కాకుండా తాంజానియా, జాంబియా, కెన్యా, ఉగాండా, జింబాంబ్వే, నమీబియా, ఘనా, నైజీరియా, అంగోలా, సుడాన్, కాంగో లాంటి 28 ఆఫ్రికా దేశాల్లో రిలీజ్ చేయబోతున్నారు.  ఇలా ఆఫ్రికా ఖండంలో తొలిసారి ఎన్ని దేశాలలో విడుదల అవుతున్న తొలి తెలుగు చిత్రంగా రికార్డు సంపాదించింది. ఈ సినిమా ఈవెంట్లని నిర్వహించే సంస్థ శ్రేయాస్ మీడియా దాని అనుబంధ నిర్మాణ సంస్థ అయిన గుడ్ సినిమా గ్రూప్ తో కలిసి ఆఫ్రికా ఖండం లో ఆర్ ఆర్ ఆర్ సినిమాని విడుదల చేస్తున్నారు. అయితే ఈ సినిమా అక్కడి ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో అని అందరు ఆసక్తిగా గమనిస్తున్నారు.