RRR Movie: ఆంధ్ర కర్ణాటక సరిహద్దుల్లో RRR ఈవెంట్.. అక్కడ చేయడానికి కారణం ఇదేనా?

RRR Movie: దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఈనెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కావడంతో పెద్ద ఎత్తున అన్ని రాష్ట్రాలలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోని ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఈ నెల 18 దుబాయ్ లోను 19 వ తేదీ బెంగళూరులో నిర్వహించడానికి చిత్రబృందం భారీ ఏర్పాట్లు చేశారు. ఇక ఈ నెల 18వ తేదీ జరగబోయే సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకను భారీ ఎత్తున ప్లాన్ చేశారు. ఇక ఈ వేడుకను కర్ణాటక ఆంధ్రా సరిహద్దు ప్రాంతమైన చిక్బల్లాపూర్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ కార్యక్రమానికి కర్ణాటక ముఖ్యమంత్రి కూడా హాజరవుతున్నారని అలాగే ఆయనతో పాటు పలువురు మంత్రులు, కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ కూడా హాజరవుతారని సమాచారం. ఇకపోతే ఈ కార్యక్రమాన్ని బెంగళూరులో కాకుండా ఇటు ఆంధ్రాలో కాకుండా రెండు రాష్ట్రాలకు సరిహద్దు ప్రాంతంలో నిర్వహించడం ఏంటి అనే విషయంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రాలో ఎన్టీఆర్ చరణ్ అభిమానులు పెద్ద ఎత్తున వస్తారు ఈ క్రమంలోనే పలు సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి.

అదేవిధంగా రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తే రెండు రాష్ట్రాలలోనూ పెద్ద ఎత్తున సినిమా మార్కెట్ స్థాయి పెరుగుతుందని జక్కన్న ప్లాన్ వేశాడట.అందుకే ఈ సినిమా వేడుకను రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన చిక్బలాపూర్ లో నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ కార్యక్రమానికి సుమారు రెండు లక్షల మంది వరకు అభిమానులు హాజరయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక కోసం ఏర్పాట్లను వేగవంతం చేస్తున్నారు.