Bollywood : బాలీవుడ్ ను తొక్కుకుంటూ పోతున్న ఆర్ఆర్ఆర్….!

Bollywood: ఆర్ ఆర్ ఆర్ సినిమా రాజమౌళి దర్శకత్వ ప్రతిభతో తెలుగు చలన చిత్ర పరిశ్రమ సత్తా ఏమిటో ప్రపంచవ్యాప్తంగా తెలియజేసింది. అంతేకాదు ఆర్ఆర్ఆర్ సినిమాలో భీమ పాత్రలో ఎన్టీఆర్, రామ్ పాత్రలో చరణ్ నటనతో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు. ఇద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడి నటించారు. కొన్ని సన్నివేశాల్లో తారక్ తన నటనతో అభిమానులను ఫిదా చేశారు. సినిమాను చూసిన సెలబ్రిటీలు హీరో హీరోయిన్లు దర్శకులు మొదలైన వారందరూ సినిమాను తీసిన విధానాన్ని,ఎన్టీఆర్ చరణ్ ల నటన డాన్స్ లను చూసి పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.విడుదలైన రోజు నుంచి భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది.

సుమారు 450 కోట్ల భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చి..మొదటి రోజు మొదటి ఆటతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని , బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతుంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ భారత దేశంలో అన్ని భాషల్లో ఆర్ఆర్ఆర్ పలు రికార్డ్స్ బ్రేక్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంది. తాజాగా హిందీ లో గంగూబాయి కతియావాడి, ధీ కాశ్మీర్ ఫైల్స్ కలెక్షన్లను బ్రేక్ చేసింది ఆర్ఆర్ఆర్.

ఈ సినిమా వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన ది కాశ్మీర్ ఫైల్స్, అలియా భట్ నటించిన గంగూబాయి కతియావాడి సినిమాల కలెక్షన్స్ ను కూడా అధిగమించి 2022లో అత్యంత వేగంగా రూ.100 కోట్ల క్లబ్‌లోకి ప్రవేశించిన సినిమాగా నిలిచింది.ఈ పీరియాడికల్ డ్రామా కేవలం ఐదు రోజుల్లోనే మూడు అంకెల వసూళ్ల మార్క్‌ను దాటి తెలుగు సినిమా సత్తా చాటింది.