ఎలాంటి సందేహం అనేది లేకుండా వరల్డ్ వైడ్ సినిమాగా దగ్గర కానీ ఆడియెన్స్ దగ్గర కానీ భారీ ఫేమ్ ని అందుకున్న ఇండియన్ సినిమా ఏదన్నా ఉంది అంటే అది ఖచ్చితంగా దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన సెన్సేషనల్ చిత్రం ట్రిపుల్ ఆర్(RRR) అనే చెప్పుకోవాలి.
కాగా ఈ చిత్రానికి ప్రతి చిన్న అంశం కూడా కలసి రావడంతో ఇదొక గ్లోబల్ ఫినామినా అయ్యింది. హీరోలు ఎన్టీఆర్ సహా రామ్ చరణ్ ల టాలెంట్ కి తగ్గట్టుగా రాజమౌళి అండ్ టీం చేసిన ఈ సమిష్టి కృషి RRR అనే పేరుని వరల్డ్ వైడ్ గా ఎక్కడో నిలబెట్టింది. అయితే ఈ సినిమా తర్వాత అల్టిమేట్ గా క్యాప్టెన్ ఎస్ ఎస్ రాజమౌళి పేరే వరల్డ్ సినిమా దగ్గర అయితే హైలైట్ అయ్యింది.
దీనితో రాజమౌళి బ్రాండ్ ఇంకా పెరగగా ఇక అక్కడ నుంచి తన నెక్స్ట్ సినిమాలపై అయితే అంతా ఆసక్తి నెలకొంది. ఇక ఈ గ్యాప్ లో రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ RRR పార్ట్ 2 పై ఇంట్రెస్టింగ్ సమాచారం అందివ్వడం వైరల్ గా మారగా.. ఈ పార్ట్ 2 విషయంలో మాత్రం ముందు రేంజ్ హైప్ ఉండదా అనిపిస్తుంది.
ఎందుకంటే విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ RRR 2 ని బహుశా రాజమౌళి దర్శకత్వం వహించకపోవచ్చు. కానీ తన పర్యవేక్షణ ఉంటుంది అని కన్ఫర్మ్ చేశారు. దీనితో RRR నుంచి రాజమౌళి బ్రాండ్ లేనట్టే అని చెప్పాలి. దీనితో పార్ట్ 2 కి ముందు సినిమా రేంజ్ హైప్ అయితే ఉంటుందా అంటే కష్టమే అని చెప్పాలి.
జస్ట్ RRR అనే పేరు తప్ప రాజమౌళి డైరెక్టర్ కాదు అనే మాట అయితే బయటకొస్తే ఇక అంతా కంటెంట్ మీదే ఆధారపడి ఉంటుంది అని చెప్పాలి. రాజమౌళి దర్శకత్వం లేదు అంటే అది సినిమాకి బాగా మైనస్ అనే చెప్పాలి.