Rowdy Boys: ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధమైన రౌడీ బాయ్స్… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Rowdy Boys: టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాతగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న బడ ప్రొడ్యూసర్ దిల్ రాజు సోదరుడి వారసుడిగా ఇండస్ట్రీలోకి రౌడీ బాయ్స్ చిత్రం ద్వారా అడుగుపెట్టారు హీరో ఆశిష్. రౌడీ బాయ్స్ చిత్రాన్ని కాలేజ్ బ్యాక్ డ్రాప్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. హర్ష కనుగంటి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రంలో ఆశిష్ సరసన అనుపమ నటించారు.

సంక్రాంతి కానుకగా థియేటర్ లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా సందడి చేయలేకపోయింది. ఈ సినిమాలో హీరో ఆశిష్ నటనకు మంచి మార్కులు వచ్చినప్పటికీ ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను సందడి చేయక పోవడమే కాకుండా కలెక్షన్లను కూడా రాబట్టలేకపోయింది. ఇదిలా ఉండగా సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమాకు పోటీగా బంగార్రాజు సినిమా రావడంతో పూర్తిగా కలెక్షన్స్ క్లోజ్ అయ్యాయి. ఈ విధంగా ప్రేక్షకులను థియేటర్లో సందడి చేయలేకపోయిన ఈ సినిమా ఓటీటీలో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడానికి సిద్ధమైంది.

సాధారణంగా ఒక సినిమా థియేటర్లలో విడుదలైన నెలరోజులకు ఓటీటీలో విడుదలవుతూ ప్రేక్షకులను సందడి చేస్తుంటాయి ఈ క్రమంలోని రౌడీ బాయ్స్ చిత్రం థియేటర్లలో విడుదలైన 50 రోజులకు ప్రముఖ ఓటీటీ సంస్థ జీ-5 యాప్‌లో మార్చి సెకండ్ వీక్ నుంచి రౌడీ బాయ్స్ స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే త్వరలోనే ఈ విషయం గురించి జీ 5 అధికారకంగా తెలియజేయనుంది. థియేటర్లు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినా ఈ సినిమా ఓటీటీలో అయినా మంచి గుర్తింపు సంపాదించుకుంటుందో లేదో తెలియాల్సి ఉంది.