Roshan Meka: వైజయంతీ బ్యానర్‌లో రోషన్ మూడో మూవీ… అధికారికంగా ప్రకటించిన మేకర్స్!

Roshan Meka: ఫ్యామిలీ స్టార్ హీరోగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ఇమేజ్‌‌ని క్రియేట్ చేసుకున్న నటుల్లో ఒకరు హీరో శ్రీకాంత్. ఒకప్పుడు హీరోగా ఫ్యామిలీ కథాంశంతో కూడిన సినిమాలు తీసి ఇంటిల్లిపాది చూసే విధంగా ఉండేటటువంటి సీన్లతో తెలుగు ప్రేక్షకుల మదిని దోచుకున్నారు శ్రీకాంత్. ఆ తర్వాత కొంత గ్యాప్ ఇచ్చిన శ్రీకాంత్ అఖండ సినిమాతో విలన్‌గా తన విశ్వరూపం చూపిస్తున్నారు. కెరీర్ ప్రారంభంలో విలన్ క్యారెక్టర్‌లు చేసినా ఆ తర్వాత మాత్ర హీరోగా చాలా కాలం పాటు తన హవా సాగేటట్టు కెరీర్‌ను బిల్డ్ చేసుకున్నారు శ్రీకాంత్.

ఇకపోతే ఇప్పుడు ఆయన కుమారుడు రోషన్ కూడా హీరోగా ఎదుగిన విషయం అందరికీ తెలిసిందే. నిర్మల కాన్వెంట్‌ సినిమాతో హీరోగా పరిచయం అయి రోషన్‌ ఆ తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని తన తండ్రి నటించిన పెళ్లిసందడి అనే టైటిల్‌తో గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించారు. ఈ సినిమాలో రోషన్ నటనకి మంచి మార్కులే పడ్డాయి. దీంతో రోషన్ కథలు ఎంచుకోవడంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అతనితో సినిమాలు చేసేందుకు కూడా బడా నిర్మాతలు ముందుకొస్తున్నట్టు సమాచారం.

ఇదిలా ఉండగా తాజాగా వైజయంతి మూవీస్, స్వప్న మూవీస్ బ్యానర్‌లో ఓ సినిమాని చేసేందుకు రోషన్ కమిట్ అయినట్టు తెలుస్తోంది. ఈ సినిమాతో ఓ కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కానున్నాడని సమాచారం. జాతీయ అవార్డు గెలుచుకున్న దర్శకుడు ప్రదీప్ అద్వైతం ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్టు సమాచారం . అయితే తాజాగా రోషన్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ఆసక్తికరమైన పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ చిత్రానికి ప్రదీప్ స్ర్కిప్టు సిద్ధం చేయగా , రోషన్ ఓ డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నట్టు తెలుస్తోంది.