Roshan Kanakala: రోషన్ కనకాల హీరోగా త్వరలో సినిమా… దర్శకుడు ఎవరో తెలుసా.. ?

Roshan Kanakala: తల్లిదండ్రులు సెలబ్రిటీలు ఐతే వారి పిల్లలు కూడా దాదాపుగా అదే మార్గంలో వెళుతూ ఉంటారు. మెగా స్టార్ – రామ్ చరణ్, సూపర్ స్టార్ కృష్ణ – ప్రిన్స్ మహేష్ బాబు, ఇలా ఇండస్ట్రీలో చెప్పుకుంటూ పోతే చాలా మందే ఉన్నారు. అయితే బుల్లి తెరపై తన కామెడీతో, యాంకరింగ్ తో ప్రేక్షకులను కట్టి పడేస్తున్న సుమ, ఇప్పటికే పలు సినిమాల్లో నటించి గుర్తింపు పొందిన రాజీవ్ కనకాల ముద్దుల కొడుకు రోషన్ కూడా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోని అడుగు పెట్టబోతున్నాడని సమాచారం. నిజం చెప్పాలంటే కొన్నాళ్ళ క్రితమే రోషన్ ను హీరోగా పరిచయం చేద్దామని అనుకున్నారు. కానీ అంతగా కారణాలు తెలియక పోయినా, అది వర్కవుట్ కాలేకపోయింది. ఆ తర్వాత మళ్లీ ఈ వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది.

అయితే ఈ సినిమా వివరాల విషయానికొస్తే ఉయ్యాల జంపాల, మజ్ను లాంటి వైవిద్యమైన సినిమాలు తీసిన విరించి వర్మ దర్శకత్వంలో రానున్నట్టు తెలుస్తోంది. కాగా ఆ !, జాంబీ రెడ్డి లాంటి కంటెంట్ సినిమాలు చేసిన ప్రశాంత్ వర్మ ఈ మూవీకి కథను అందిస్తున్నారని టాక్. దీంతో ఈ సినిమా కూడా మంచి లవ్ స్టోరీ నేపథ్యంలో సాగే కథలానే అనిపిస్తుంది. ఈ ఇద్దరు బెస్ట్ పర్సన్స్ కలిస్తే సినిమా సూపర్ హిట్ అవుతుందని పలువురు భావిస్తున్నారు. అందుకే సుమ కూడా ఈ ప్రాజెక్ట్ కోసం చాలా కష్ట పడుతున్నారని సమాచారం.

ఇక ఈ సినిమాకు నిర్మాత ఎవరూ అన్న దానిపై ఇప్పటి వరకూ ఎలాంటి క్లారిటీ రాలేదు. ఐనా సుమకు ఉన్న ఫాలోయింగ్, పాపులారిటీ గురించి తెలిసి కూడా నిర్మాతలు నో చెప్తారా అంటూ సినీ వర్గాలు అంటున్నాయి. ఇక రాజీవ్ కనకాల కూడా ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలమైంది. కాబట్టి ఆయనక్కూడా సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు ఉంది. ఈ ఇద్దరి పాపులారిటీతో కొడుకును ఎలాగైనా హీరోగా నిలబెట్టేందుకు వారు శత విధాలా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇంతకు ముందు కూడా రోషన్ హీరోగా చేస్తున్నాడు అంటూ అనౌన్స్ చేశారు. ఆ సినిమాకు విజయ్ అనే కొత్త దర్శకుడు తీస్తున్నారంటూ వార్తలు కూడా వచ్చాయి. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు గానీ, దాని మళ్ళీ ఎలాంటి సమాచారం లేదు. ఇక అది ఆగిపోయిందా, లేదంటే మున్ముందు తీస్తారా అన్న విషయంలో ఎలాంటి స్పష్టతా లేదు.