పేరు మార్చుకున్న రోషన్.. ఇదంతా అదృష్టం కోసమేనా!

టాలీవుడ్ హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ గురించి అందరికీ పరిచయమే. నిర్మల కాన్వెంట్ సినిమాతో తొలిసారిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఆ తర్వాత రాఘవేంద్రరావు పర్యవేక్షణలో గౌరీ రోణంకి దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెళ్లి సందD’ సినిమాలో నటించగా అందులో తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

కానీ ఈ సినిమా అంతగా సక్సెస్ కాలేకపోయింది. ఇక రోషన్ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటాడు. ఇదిలా ఉంటే తాజాగా తాను పేరు మార్చుకున్నాడు. న్యూమరాలజీ ప్రకారం తన పేరుకు మరో ‘n’ ను జోడించాడు. దీన్ని బట్టి చూస్తే ఇదంతా అదృష్టం కోసమే అని తన పేరును మార్చుకున్నట్లు తెలుస్తుంది. గతంలో పలువురు నటీనటులు కూడా ఇలాగే పేరు మార్చుకొని తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.