రాజకీయాల్లోకి వచ్చాకా రోజా సినిమాలను వదిలేశారు. మంత్రి అయ్యాకా బుల్లితెర పైనా కనిపించట్లేదు రోజా. అయితే, తాజాగా ఓ సినిమా ఆఫర్ రోజా ముందుకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఓ యంగ్ హీరో నటిస్తున్న సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ కోసం రోజాని సంప్రదించాలనుకుంటున్నారట.
హోమ్ మినిస్టర్ పాత్రనీ తెలుస్తోంది. పవర్ ఫుల్ అప్పియరెన్స్ వుండబోతోందనీ అంటున్నారు. ఈ పాత్రకు రోజా అయితే, న్యాయం చేస్తుందని చిత్ర యూనిట్ నమ్ముతున్నారట. అలాగే వైసీపీ పార్టీకి సంబంధించిన శక్తివంతమైన డైలాగులు ఈ పాత్ర కోసం రాయిస్తున్నారట.
మరి, ఈ ఆఫర్‌ని రోజా ఒప్పుకుంటుందా.? ఆల్రెడీ ఆమె సన్నిహితుల నుంచి అందుతోన్న సమాచారం ఏంటంటే, ప్రస్తుతానికి రోజా ఇందుకు అంగీకారం తెలిపలేదట. కానీ, ఆ పాత్రలో కనిపించేందుకు ఆమె సుముఖంగానే వున్నారనీ ఇన్‌సైడ్ టాక్.
అయితే, పై స్థాయిలో అనుమతి తీసుకుని గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ వుందని తెలుస్తోంది. ఏంటా పై స్థాయి.? ఏమా కథ.? త్వరలోనే వివరాలు వెల్లడి కానున్నాయ్.
మరోవైపు రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా దూసుకెళ్తున్నారు మంత్రి రోజా. అదే ఫైర్ వెండితెరపైనా చూపిస్తే.. అదనపు ఆకర్షణే అవుతుంది. పొలిటికల్‌గా స్పాంటీనియస్ పవర్ ఫంచ్‌లతో ఊదరగొట్టే రోజా కోసం స్ర్కిప్టు ప్రిపేర్ చేయాలంటే.. ఆ పంచ్ పవర్ ఇంకే స్థాయిలో వుండబోతోందో కదా.! లెట్స్ వెయిట్ అండ్ సీ.!