నా గ్రౌండ్‌కు నువ్వే ధోని.. జానీ మాస్టర్‌పై రోహిణి కామెంట్స్ వైరల్

Rohini satires On Jani Master In Meeku Meere Maaku Meme

బిగ్ బాస్ ఫేమ్ రోహిణి ఈ మధ్య బుల్లితెరపై ఓ రేంజ్‌లో దూసుకుపోతోంది. అంతకు ముందు సీరియల్స్‌లో కామెడీ రోల్స్ చేస్తూ నెట్టుకొచ్చిన రోహిణికి బిగ్ బాస్ షోతో స్టార్డం వచ్చేసింది. షోలో రోహిణి చేసిన రచ్చ, ఎంటర్టైన్మెంట్ చేసిన విధానానికి మంచి పాపులార్టీ వచ్చింది. మొత్తానికి రోహిణికి మాత్రం బిగ్ బాస్ షో కలిసి వచ్చింది. షో నుంచి బయటకు వచ్చాక ఆఫర్స్ పెరిగాయి. మరీ ముఖ్యంగా జబర్దస్త్ స్టేజ్ మీద రోహిణికి మంచి అవకాశాలు లభించాయి.

Rohini satires On Jani Master In Meeku Meere Maaku Meme
Rohini satires On Jani Master In Meeku Meere Maaku Meme

హైపర్ ఆది స్కిట్స్‌లో పలుమార్లు కనిపించిన రోహిణి స్పెషల్ ఈవెంట్లలోనూ సత్తా చాటుతోంది. దసరా దీపావళి ఇలా పండుగలు ఏవైనా సరే కొంతమంది ఆర్టిస్ట్‌లు మాత్రం ఫుల్ బిజీగా ఉంటున్నారు. మరీ ముఖ్యంగా బిగ్ బాస్ ఫేమ్ రోహిణి, శివజ్యోతి, రవికృష్ణ వంటి వారు పలు ఈవెంట్లలో దుమ్ములేపుతున్నారు. దీపావళికి జెమినీ టీవీలో రాబోతోన్న ఈవెంట్‌లో రోహిణి రచ్చ చేసినట్టు కనిపిస్తోంది.

మీకు మీరే మాకు మేమే అనే ఈ ఈవెంట్‌లో జానీ మాస్టర్ అదిరిపోయే డ్యాన్స్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. తాను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం జెమినీ చానెల్ అని చెప్పి ఎమోషనల్ అయ్యాడు. తాజాగా జానీ మాస్టర్‌పై రోహిణి వేసిన పంచ్‌కు అందరూ పగల బడి నవ్వారు. ఈ మేరకు విడుదల చేసిన ప్రోమో ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది. జానీ జానీ.. నువ్ నా గ్రౌండ్‌కు ధోని అని రోహిణి అనేసరికి డబుల్ మీనింగ్ వచ్చేసింది. దీంతో అందరూ నవ్వేశారు.