సందడి చేయలేకపోతున్నా రాకింగ్ రాకేష్.కారణం అదేనా?

Rocking Rakesh: బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్య క్రమంలో వారు ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో రాకింగ్ రాకేష్ ఒకరు. టాకింగ్ రాకేష్ జబర్దస్త్ కార్యక్రమానికి వచ్చిన మొదట్లో చిన్న పిల్లలతో కలిసి పంచు డైలాగులు వేస్తూ ఎంతో అద్భుతమైన కామెడీ చేసేవారు. ఎంతగా అంటే చిన్న పిల్లలతో కూడా ఇలాంటి స్కిట్ చేయవచ్చా అనేలా ఈయన కామెడీ ప్రేక్షకులను ఆకట్టుకునేది.ఈ విధంగా తన అద్భుతమైన కామెడీ పంచ్ డైలాగులతో ప్రేక్షకులను ఎంతో సందడి చేసే రాకింగ్ రాకేష్ ఈ మధ్య కాలంలో కాస్త స్లో అయినట్టు తెలుస్తోంది.

గతంలో చిన్న పిల్లలతోను అలాగే తన స్కిట్ లో కొత్త కంటెస్టెంట్ తీసుకువచ్చి జబర్దస్త్ కు పరిచయం చేసిన రాకింగ్ రాకేష్ ఈ మధ్య కాలంలో కేవలం జోర్దార్ సుజాతను మాత్రమే హైలెట్ చేస్తున్నారు. గత కొద్ది రోజుల క్రితం వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. ఇలా వీరి పెళ్లి గురించి ప్రకటన చేసిన తర్వాత రాకింగ్ రాకేష్ స్కిట్ లో జోర్దార్ సుజాత తప్ప మరెవరూ కనిపించడం లేదు.

ఈక్రమంలోనే రాకింగ్ రాకేష్ తన పంచ్ డైలాగులను జోర్దార్ సుజాత పై మాత్రమే వేయడం పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాడు. ఈ క్రమంలోనే తన స్కిట్ కూడా ప్రేక్షకులను పెద్దగా సందడి చేయలేకపోతుందని చెప్పాలి. ఇకపోతే పటాస్ ప్రవీణ్ కూడా రాకింగ్ రాకేష్ స్కిట్ లో కామెడీ పండించడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేదు. ఈక్రమంలోనే రాకింగ్ రాకేష్ స్కిట్ పై పలువురు స్పందిస్తూ జోర్దార్ సుజాత మాత్రమే కాకుండా మరెవరూ మీ స్కిట్ లో చేయడానికి లేరా… తనని మార్చండి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇలా వీరిద్దరిపై మొదట్లో కామెడీ పండినప్పటికీ ప్రస్తుతం వీరు స్కిట్ లను చూసి ప్రేక్షకులకు కూడా బోర్ కొడుతుంది అనే చెప్పాలి.