రోహిణి‌తో ఉన్న రిలేషన్ అదే.. జబర్దస్త్ రాకేష్ కామెంట్స్ వైరల్

బిగ్ బాస్ షో ద్వారా రోహిణి బాగా ఫేమస్ అయింది. అంతకు ముందు బుల్లితెరపై సీరియల్స్‌లో కామెడీ పాత్రల్లో నటించిన రోహిణి మంచి క్రేజ్‌ను దక్కించుకుంది. అదే సమయంలో బిగ్ బాస్ ఆఫర్ రావడంతో రోహిణి క్రేజ్ మారిపోయింది. అయితే బిగ్ బాస్ ఇంట్లో ఉన్నది కొన్ని రోజులే కావడంతో రోహిణికి అంతగా నిరూపించుకునే అవకాశం రాలేదు. ఉన్న కొన్ని రోజులు బాగానే ఎంటర్టైన్ చేసింది. అలా బయటకు వచ్చిన రోహిణికి మంచి ఫాలోయింగ్ పెరిగింది.

Rocking Rakesh About Rohini In Extra Jabardasth
Rocking Rakesh about Rohini In Extra Jabardasth

బిగ్ బాస్ తరువాత ఆమెకు అవకాశాలు బాగానే పెరిగాయి. మరీ ముఖ్యంగా రోహిణి టైమింగ్ అందరికీ బాగా కనెక్ట్ అవుతుంది. అందుకే రోహిణిని జబర్దస్త్ స్టేజ్ మీదకు తీసుకొచ్చారు. మొదటగా హైపర్ ఆది స్కిట్‌లో అలా ఓ ఒకటి రెండూ ఎపిసోడ్‌లు చేసినా గానీ చివరకు రాకేష్ స్కిట్లలో ఫిక్స్ అయింది. అసలే ఇప్పుడు పిల్లలు షోకు దూరంగా ఉండటంతో రోహిణి అండగా నిలబడింది. ఒకప్పుడు పిల్లల వల్ల స్కిట్లు బాగానే పేలేవి. ఇప్పుడు రోహిణి వల్ల స్కిట్లు బాగానే క్లిక్ అవుతున్నాయి.

అలా రాకేష్, రోహిణి కెమిస్ట్రీ కూడా బాగానే వర్కవుట్ అయింది. అయితే ఇలా కంటిన్యూగా స్కిట్లు చేస్తుండటం, అది కూడా భార్యా భర్తలుగా నటిస్తూ రావడంతో ఓ పుకారు బయటకు వచ్చింది. ఇద్దరి మధ్య ప్రేమ ఉందనే వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఓ స్కిట్ వేసిన అనంతరం చివర్లో రోజా ముందు అసలు సంగతి తెలిసిందే. మా ఇద్దరి మధ్య ఉన్నది ప్రేమ కాదు కానీ.. నాకు మాత్రం అండగా నిలబడింది.. కొన్ని సమయాల్లో నన్ను ఎంతో సపోర్ట్ చేసిందంటూ రోహిణి గురించి చెబుతూ రాకేష్ ఎమోషనల్ అయ్యాడు.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles