Rocket Raghava: టాలీవుడ్ ఇండస్ట్రీలో బుల్లితెర మీద ప్రసారమై గత పది సంవత్సరాలుగా విజయవంతంగా కొనసాగుతున్న కామెడీ షో జబర్దస్త్ . ఇన్ని సంవత్సరాలు ఏ కామెడీ షో ప్రసారం కాలేదు. ఇతర చానల్స్ లో జబర్దస్త్ కి పోటీగా ఎన్ని కామెడీ షో లు వచ్చినా కూడా జబర్దస్త్ కి ఉన్నంత ప్రేక్షకాదరణ పొందలేకపోయాయి. అందుకు కారణం జబర్దస్త్ హోల్ టీమ్. 10 సంవత్సరాల క్రితం ప్రారంభమైన జబర్దస్త్ లో ఇప్పటివరకు ఎన్నో మార్పులు జరిగాయి. ఎంతో మంది కొత్త కొత్త కమెడియన్లు ఈ షో ద్వారా ఇండస్ట్రీకి పరిచయమై స్టార్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
ఈ జబర్దస్త్ నుండి కొంత మంది కమెడియన్లు బయటికి వెళ్లిపోయిన కూడా కొంతమంది మాత్రం జబర్దస్త్ ప్రారంభమైన నాటి నుండి ఇప్పటి వరకు జబర్దస్త్ లో ఉండి ప్రేక్షకులను అలరిస్తున్నారు. అటువంటి వారిలో రాకెట్ రాఘవ ఒకరు.చాలామంది సినిమా ఆఫర్లు రావడంతో జబర్దస్త్ నుండి వెళ్ళిపోయి మరి అక్కడ ఆఫర్స్ తగ్గటంతో తిరిగి వచ్చారు. కానీ రాకెట్ రాఘవ మాత్రం ఇప్పటివరకు జబర్దస్త్ లో అలాగే కొనసాగుతూ ఉన్నాడు.జబర్దస్త్ లో కొన్ని సంవత్సరాలుగా జడ్జ్ గా వ్యవహరించిన నాగబాబు కొన్ని అనివార్య కారణాల వల్ల కొంత కాలం క్రితం బయటకు వెళ్ళగా.. ఇటీవల మంత్రి పదవి దక్కడం తో రోజా కూడా జబర్దస్త్ కి గుడ్ బై చెప్పింది.
అనసూయ, రష్మీ కూడా ఎంతోకాలంగా ఈ షోకి యాంకర్లుగా వ్యవహరిస్తున్నారు. జబర్దస్త్ లో చాలా కాలం నుండి ఉంటున్న రాకెట్ రాఘవ పారితోషికం గురించి ఇప్పుడు చర్చ జరుగుతోంది. రెమ్యూనరేషన్ విషయంలో చాలా కట్టుదిట్టమైన నియమాలను పాటించే మల్లెమాల వారు రాకెట్ రాఘవ కి ఎంత పారితోషికం ఇస్తున్నారు అని ప్రశ్నలు మొదలయ్యాయి. అయితే సమాచారం ప్రకారం రాకెట్ రాఘవ ఒక్కో ఎపిసోడ్ కి 1.25 లక్షలు పారితోషికం అందుకుంటున్నాడు. రాకెట్ రాఘవ కంటే మిగిలిన టీమ్ లీడర్లకు ఎక్కువ పారితోషికం ఉన్నప్పటికీ రాకెట్ రాఘవ మాత్రం తక్కువ పారితోషికం తీసుకుంటూ ఇన్ని సంవత్సరాలుగా జబర్దస్త్ లో కొనసాగుతున్నాడు.