సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసు తిరిగినన్ని మలుపులు ఇప్పటి వరకు ఏ కేసూ తిరగలేదు. ఆయన చనిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు కేసులో ఎన్నో ట్విస్టులు. ఒక సినిమాలో కూడా ఇన్ని ట్విస్టులు ఉండవు. నిజంగా ఒక సెలబ్రిటీ మరణం.. ఇన్ని ట్విస్టులకు కారణమవ్వడం బహుశా ఇదే మొదటి సారి కావచ్చు.
సుశాంత్ కేసులో ఎక్కువగా అనుమానిస్తున్నది ఆయన ప్రేయసి రియా చక్రవర్తినే. ఆమె గురించి రోజురోజుకూ సంచలన నిజాలు బయటికి వస్తున్నాయి. కొందరైతే రియానే సుశాంత్ ను చంపించిందంటూ ఆరోపిస్తున్నారు. రియా చక్రవర్తి.. సుశాంత్ కు డ్రగ్స్ అలవాటు చేసిందని… సుశాంత్ ను తన వశం చేసుకున్నదని… డబ్బు కోసం సుశాంత్ ను వేధించేదంటూ వార్తలు కూడా వచ్చాయి. డ్రగ్స్ డీలర్ ను రియా కలవడం దగ్గర్నుంచి.. ఆమె డ్రగ్స్ కొనుగోలు చేయడం వరకు అన్ని వివరాలు బయటపడ్డాయి. దీంతో కేసు ఒక్కసారిగా రియా వైపు తిరిగింది.
అంతే కాదు..ఇంతకుముందే ఈడీ కూడా రియాను విచారించింది. తన ఫోన్, లాప్ టాప్ అన్నీ చెక్ చేసింది. కాల్ డేటాను కూడా విచారించింది. ఆ తర్వాత కేసు సీబీఐ చేతుల్లోకి వెళ్లింది. ప్రస్తుతం సీబీఐ అధికారులు సుశాంత్ కేసును విచారిస్తున్నారు. ఈనేపథ్యంలో సీబీఐ అధికారులు కూడా రియాను ప్రశ్నిస్తున్నారు.
అయితే.. సుశాంత్ చనిపోయినప్పటి నుంచి ఇఫ్పటి వరకు మీడియా ముందుకు రియా రాలేదు. బహిరంగంగా నోరు విప్పలేదు. కానీ.. సడెన్ గా ఆమె మీడియా ముందుకు వచ్చింది.
చాలారోజుల నుంచి మీ మీద ఆరోపణలు వస్తున్నాయి కదా. అయినా కూడా ఇన్నిరోజులు మౌనంగా ఉండి ఇప్పుడు మాత్రం మీడియా ముందు ఎందుకు వచ్చారు..అంటూ మీడియా ప్రశ్నించగా… రియా ఏం చెప్పిందో తెలుసా?
అవును… నాపై రోజురోజుకూ ఆరోపణలు పెరుగుతూనే ఉన్నాయి. కానీ.. అవన్నీ నిజాలు కావు. అందుకే మౌనంగా భరించా. కానీ.. రాత్రి నా కలలోకి సుశాంత్ వచ్చాడు. నువ్వు ఎందుకు భయపడుతున్నావు. నిర్భయంగా బయటికి వెళ్లి నిజాలను చెప్పు.. అంటూ నన్ను కోరాడు. అందుకే ఇప్పుడు నేను బయటికి వచ్చా.. అంటూ చెప్పుకొచ్చింది రియా.
మరి.. డైరెక్టర్ మహేశ్ భట్ తో ఉన్న సాన్నిహిత్యం సంగతి ఏంటి? అని ప్రశ్నించగా.. నాకంటే ముందే సుశాంత్ కు, మహేశ్ భట్ కు పరిచయం ఉంది. భట్.. మా ఇద్దరితోనూ సన్నిహితంగానే ఉండేవారు. మహేశ్ భట్ సార్ నా తండ్రి లాంటి వారు. ఆయనతో నాకు ఉన్నది తండ్రీకూతుళ్ల బంధం. కానీ.. మా ఇద్దరి మధ్య శారీరక సంబంధాన్ని అంటగడుతున్నారు… సుశాంత్ ఫ్యామిలీలో మాత్రం గొడవలు ఉన్నాయి.. అంటూ రియా మీడియా ముందు తెలిపింది.