సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం మిస్టరీ సినిమాని తలపిస్తోంది. ఈ కేసులో ప్రియురాలు రియా చక్రవర్తి పేరు పదే పదే ప్రస్తావనకు వస్తోంది. ప్రస్తుతం సీబీఐ ఈ కేసును టేకోవర్ చేసి దర్యాప్తు సాగిస్తోంది. ఇందులో రియాపైనే కీలక విచారణ సాగనుంది.
తాజా సమాచారం ప్రకారం.. సుశాంత్ పై ప్రమాదకర మాదకద్రవ్యాల్ని రియా చక్రవర్తి ప్రయోగించింది! అన్న వాదనకు బలం చేకూరే పలు ఆధారాలు బయటపడుతున్నాయి. దీనిపై సీబీఐ ఆరాలు మొదలయ్యాయని తెలిసింది. ఇప్పటివరకూ రియాను ఈడీ.. పోలీస్ విచారించినా సీబీఐ విచారించలేదు. తదుపరి రియాను విచారించేందుకు సీబీఐ అధికారులు రెడీ అవుతున్నారని సమాచారం.
అలాగే మాదక ద్రవ్యాల డీలర్లతో రియా చక్రవర్తి వాట్సాప్ సంభాషణలు పెనుదుమారం రేపుతున్నాయి. ఈ కేసులో రియా చక్రవర్తి.. తన సోదరుడు కూడా మాదక ద్రవ్యాల కొనుగోళ్లు సాగించారని డీలర్స్ తో చాటింగ్ చేశారని రుజువులు లభించాయి. హైపవర్ డ్రగ్స్ కోసం రియా డ్రగ్ డీలర్లను ఆశ్రయించింది. ఇక సుశాంత్ డిప్రెషన్ కి కారణమేమిటి? అంటే మాదక ద్రవ్యాల వినియోగం.. అలాగే మానసిక చికిత్సలోనూ ప్రమాదకర మెడిసిన్ ఉపయోగించడమే కారణమన్న అనుమానాలు ఉన్నాయి. అయితే అది రియా పన్నిన కుట్రనా? రియా వెనక ఉండి కొన్ని అదృశ్య శక్తులే ఆ పని చేయించాయా? డ్రగ్స్ కు అతడు బానిస కావడానికి కారణం ఏమిటి? ఇలా అన్ని కోణాల్లోనూ సీబీఐ దర్యాప్తు చేయనుంది.