సుశాంత్ సింగ్ పై రియా కుట్ర అలా బ‌ట్ట‌బ‌య‌లు.. బ‌య‌ట‌కు చెబుతున్న‌వ‌న్నీ అబ‌ద్ధాలేనా?

Sushant Singh Case NCB arrest Rhea Chakraborty

దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ స్నేహితురాలు అత‌డిపై డ్ర‌గ్స్ ప్ర‌యోగించిందా? ఉద్ధేశ‌పూర్వ‌కంగానే మాద‌క ద్ర‌వ్యాల్ని మోతాడుకు మించి ఇవ్వ‌డం ద్వారా అత‌డు డిప్రెష‌న్ లోకి వెళ్లాడా? అన్న‌ది ఇప్పుడు స‌స్పెన్స్ గా మారింది. సుశాంత్ సింగ్ మరణించే సమయంలో, రియా చక్రవర్తి ఆమె మాఫియా వ్య‌వ‌హారాల‌పై సీబీఐ ఆరాలు తీస్తోంది. రియా చాటుమాటు వ్య‌వ‌హారాలు చూస్తుంటే అవ‌న్నీ త‌ప్పుడు సంకేతాల్ని చూపిస్తున్నాయి. రియా మాదకద్రవ్యాల దుర్వినియోగానికి సంబంధించి నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డ్ చర్య తీసుకున్న సమయంలో ఆమె మీడియాకు ఓ వివ‌ర‌ణ ఇచ్చింది. డ్ర‌గ్స్ ను తాను సుశాంత్ కి ఎలా ఇచ్చింది? అన్న‌ది చెబుతూ సుశాంత్ డ్ర‌గ్ అడిక్ట్ అంటూ చెప్పే ప్ర‌య‌త్నం చేయ‌డం అభిమానులు మ‌రిగిపోయేందుకు కార‌ణ‌మైంది.

rhea chakrabarthi and susanth singh
rhea chakrabarthi and susanth singh

ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుశాంత్ రాజ్ ‌పుత్ రద్దీ లేదా రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లాలంటేనే భయపడేవాడ‌ని దీనిని క్లాస్ట్రోఫోబియా అంటారని తెలిపింది. ఐరోపా పర్యటనలో, సుశాంత్ ఒక విమానంలో కూర్చోవడానికి చాలా భయపడ్డాడ‌ట‌. విమానం ఎక్కే ముందు అతను తన భయాన్ని తగ్గించుకోవడానికి మోడాఫినిల్ అనే టాబ్లెట్‌ను తీసుకున్నాడ‌ని తెలిపింది.

అలాగే, సుశాంత్ రోజూ ఆ మాత్రలను లోనికి పుచ్చుకునేవాడ‌ని.. అతనితో ఎక్క‌డికి వెళ్లినా తాను వాట‌న్నిటినీ తీసుకువెళతానని రియా చెప్పింది. ఏదేమైనా, రియా ఇంటర్వ్యూ ముగిసిన తరుణంలో సుశాంత్ అభిమానులు సోష‌ల్ మీడియాల్లో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

సుశాంత్ సింగ్ ఒక విమానాన్ని ఎలా నడిపించాడో.. విమాన లైసెన్స్ పొందటానికి సంతోషించాన‌ని చెప్ప‌డాన్ని అలాగే నాసాకు వెళ్ళాలనే అతని ప్రణాళికను నెటిజన్లు స్వ‌యంగా షేర్ చేయ‌డం చూస్తుంటే రియా ఎర‌క్క‌పోయి ఇరుక్కుపోయిందా? అన్న సందేహం వ్య‌క్త‌మ‌వుతోంది. సుశాంత్ మాజీ ప్రియురాలు అంకిత కాక్ పిట్ నుండి నటుడి వీడియోను పంచుకుంది (బహుశా హై-ఎండ్ సిమ్యులేటర్).. అతను విమానంలో బయలుదేరాడు. అతను క్లాస్ట్రోఫోబిక్ అయితే ఖచ్చితంగా ఈ పని చేయడం సాధ్యం కాదని ఆమె అంది.

సుశాంత్ సింగ్ ఏం చేశాడు? అతను ఎలా ఉన్నాడు అనే దాని గురించి ఇంటర్నెట్‌లో చాలా రుజువులు ఉన్నందున, రియా అలాంటి త‌ప్పుడు స‌మాచారం తో త‌ప్పుదోవ ప‌ట్టించ‌డం స‌రికాద‌నేది మెజారిటీ అభిమానుల వార్నింగ్.