సంచలనాలకి వివాదాలకి కేరాఫ్ అడ్రస్ అయిన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎలక్షన్స్ కి ముందు వ్యూహం అనే సినిమాని తీసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చంద్రబాబు నాయుడు గురించి పవన్ కళ్యాణ్ గురించి చేయకూడని కామెంట్స్ చేయటం వారి అనుమతి లేకుండా వారికి సంబంధించిన వీడియో ఫుటేజ్ లని సినిమాలో వాడుకోవడం పట్ల అతనిపై ఇప్పుడు కేసులు నమోదయ్యాయి. అయితే ఆర్జీవిని అరెస్టు చేయటానికి ఆయన ఇంటికి పోలీసులు అక్కడ ఆయన కనిపించకపోవడంతో పోలీసులకు భయపడే ఆర్జీవి పరారీ అయిపోయాడు అంటూ సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు తెగ వైరల్ అయ్యాయి. అయితే వాటికి స్పందిస్తూ రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో ఒక వీడియో రిలీజ్ చేశాడు.
పోలీసుల నోటీసులకి తాను వణికి పోవడం లేదని, సోషల్ మీడియాలో తాను పెట్టిన పోస్టులు ఎవరి మనోభావాలను దెబ్బతీసాయంట అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. నేను ఎవరి గురించి అయితే పోస్టులు పెట్టానో వారు కాకుండా ఇంకెవరికో మనోభావాలు దెబ్బతింటే ఈ పోస్టులు కేసులు ఎలా వర్తిస్తాయని ప్రశ్నించారు. పవర్ లో ఉన్న రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా సెక్షన్లను మార్చుకొని కేసులు బనాయించడం చేస్తున్నాయన్నారు.
తాను ప్రస్తుతం ఒక మూవీ షూటింగ్ లో ఉన్నానని నిర్మాతకు నష్టం వస్తుందనే కారణంతోనే విచారణకు రాలేకపోతున్నట్లు ఆయన క్లారిటీ ఇచ్చారు. అయినా ఎప్పుడో ఒక ఏడాది క్రితం చేసిన ట్వీట్స్ కేసుని ఒక వారంలో పూర్తి చేయాలని చూడటం ఎంతవరకు సబబు అని ఆయన ప్రశ్నించారు, అయినా ఈ కేసుని ఇంత హడావిడిగా విచారించవలసిన అవసరం ఏమిటో కూడా తనకి అర్థం కాలేదన్నారు. తనకు వచ్చిన నోటీసులకు తాను సమాధానం ఇచ్చానని కూడా చెప్పకు వచ్చారు రాంగోపాల్ వర్మ.
అయితే రామ్ గోపాల్ వర్మ పై నమోదైన కేసుల విషయంలో ఆయనని విచారణకు హాజరు కావాల్సిందిగా ఒంగోలు పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. అయితే రెండుసార్లు ఈ విచారణకు రాంగోపాల్ వర్మ డుమ్మా కొట్టడంతో ఆర్జీవిని అరెస్టు చేయటానికి ఆయన ఇంటికి వెళ్లారు పోలీసులు. అక్కడ కూడా ఆయన లేకపోవడంతో అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆర్జీవి పై వీడియో విడుదల చేశారు.