RGV : మహిళా దినోత్సవ కానుకను వెరైటీ గా ప్లాన్ చేసిన ఆర్జీవీ..

RGV : అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్బంగా సాధారణంగా ఫిల్మ్ మేకర్స్ సందేశత్మకంగా పోస్ట్ లు పెడతారు సామాజిక మధ్యమాల్లో. అయితే ఇందుకు భిన్నంగా రామ్ గోపాల్ వర్మ ఎంటర్ ది గర్ల్ డ్రాగన్ సినిమా ఫేమ్ పూజ బాలేకర్ అందాల ఆరబోత వీడియో ను సాయంత్రం 5గంటలకు షేర్ చేయబోతున్నట్లు ప్రకటించారు.

రామ్ గోపాల్ వర్మ తన సినిమాలతో ఎంత పేరు తెచ్చుకున్నాడో, సామాజిక మధ్యమాలలో పోస్ట్ లు పెట్టి మరింత ప్రాచుర్యం పొందారు విభిన్న పబ్లిసిటీ మార్గాలు వెతకడం లో ఆర్జీవీ ముందుంటాడు. ప్రతిసారి సెలబ్రిటిలపై తనదైన శైలిలో సటైర్లు వేస్తూ మీడియా నోట్లో నానుతుంటారు.

ఇక రామ్ గోపాల్ వర్మ రెండేళ్లుగా ఊరిస్తున్న చిత్రం లడ్కి- ఎంటర్ ది గర్ల్ డ్రాగన్, పూజ బాలేకర్ హీరోయిన్ గా వస్తోన్న సినిమా. ఇప్పటికే తన అందాల ఆరబోత వీడియోలతో కుర్రకారుకు పిచ్చెక్కించిన పూజ బాలేకర్ ఇపుడు ఎంటర్ ది గర్ల్ డ్రాగన్ లో ఎలా కనిపించునుందో ఇక ఈ సినిమాలో ఆర్జీవీ ఎలా చూపించబోతున్నాడో అనే ఆసక్తి నెలకొంది ఆర్జీవీ భక్తులకు.
ఇక ఈ సినిమాకు సంబందించిన వీడియో ను సాయంత్రం విడుదల చేయబోతున్నట్లు పోస్ట్ పెట్టగానే అది వైరల్ అయింది. చాలా మంది విమర్శలకు దారితీసింది. అయినా రామ్ గోపాల్ వర్మ కు కావాల్సింది పబ్లిసిటీ మాత్రమే అది నెగెటివ్ అయినా పాజిటివ్ అయినా పర్వాలేదు. అందుకే ఏరికోరి మహిళా దినోత్సవం నాడు పూజ బాలేకర్ వీడియో ను విడుదల చేస్తున్నాడు.

ఇక వర్మ చైనా బెస్ట్ మార్షల్ ఆర్ట్స్ సినిమాని తెరకెక్కిస్తున్నారని అందులో ఒక అమ్మాయి నటిస్తోందని ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇక తను చెప్పినట్టుగానే బ్రూస్ లీ ని పిచ్చిగా ఆదరించి ఒక మహిళ జీవిత కథ ఆధారంగా వర్మ ఈ సినిమాని తెరకెక్కించారు.. అందుకోసమే ఈ సినిమాకి గర్ల్స్ డ్రాగన్ అనే టైటిల్ ను కూడా పెట్టడం జరిగింది. ఇక మార్సెల్ నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రం అయినప్పటికీ కూడా తన ఒంపుసొంపులతో బాగా ఆకట్టుకుంటోంది పూజ బాలేకర్. వర్మ ఎం చేసిన సంథింగ్ ఉంటుందని మరికొందరు నెటిజన్లు అనడం కొస మెరుపు.