అలాంటి టైంలో నన్ను గెలకొద్దు.. రేణూ దేశాయ్ వార్నింగ్

renu Desai

రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో చేసే సందడి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆమె షేర్ చేసే ఫోటోలకు, చెప్పే కవిత్వాలకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉంటారు. ఫోటోగ్రఫీలో మాస్టర్స్ లాంటివి ఏమీ చేయకపోయినా… ప్రొఫెషనల్ ఫోటోగ్రఫర్‌లా ప్రకృతిని కెమెరాలో బంధిస్తుంటుంది. మామూలుగా ఎప్పుడూ సరదాగానే ఉంటుంది. అప్పుడప్పుడు లైవ్‌లోకి వస్తుంది.. నెటిజన్లు వేసే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంది.

renu Desai
renu Desai

ఇలా వ్యక్తిగత విషయాలే కాకుండా.. సమాజంలో జరిగే అసమానతలపై తన గళాన్ని విప్పుతుంది. హథ్రస్‌లో అమ్మాయిని దారుణంగా అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన ఘటన దేశం మొత్తాన్ని కుదిపేసింది. ఆ ఘటనపై స్పందిస్తూ.. దేశంలో మీడియా, రాజకీయ నాయకులను ప్రశ్నించింది. రెండ్రోజులు మాట్లాడతారు మళ్లీ సైలెంట్ అవుతారు.. చట్టాలు ఎప్పుడు మారతాయి.. మార్పు ఎప్పుడు వస్తుందని ప్రశ్నించింది.

తాజాగా రేణూ దేశాయ్ అదిరిపోయే ఫోటో షూట్లను చేసింది. మళ్లీ ఒక్కసారిగా పది పదిహేనేళ్లు వెనక్కి వెళ్లినట్టు తయారైంది. బద్రి నాటి రోజులను గుర్తుకు చేసేలా ఫోటో షూట్లు చేసింది. అయితే రేణూ దేశాయ్ మాత్రం తాజాగా ఓ వార్నింగ్ ఇచ్చింది. హార్రర్ సినిమాలోని ఘోస్ట్‌గా మేకప్ వేసుకుని ఓ ఫొటోను షేర్ చేస్తూ.. నేను ఆకలితో ఉన్నప్పుడు ఎవ్వరూ గెలకకండి.. అంటూ వార్నింగ్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వార్నింగ్, ఆ ఫోటో తెగ వైరల్ అవుతోంది.