త‌ప్పుడు వార్త‌ల‌ని తిప్పికొట్టిన రేణూ దేశాయ్..మ‌హేష్ ఫ్యాన్స్ అప్సెట్‌

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టామ్ డమ్ ఉన్న యాక్టర్స్ సినీ అప్డేట్స్ అంటే చాలా యాక్టివ్ గా ఉంటారు వారి అభిమానులు.. అయితే ఇలాంటి సమయంలోనే భారీ ప్రాజెక్ట్ సినిమాలకు రూమర్స్ కూడా అంతే తొందరగా వస్తుంటాయి. పరశురామ్ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కనున్న సినిమా సర్కారు వారి పాట. ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ సంక్రాంతి తర్వాత జరగనున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ యాక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సర్కారు వారి పాట సినిమాలో మహేష్ బాబు కి వదిన క్యారెక్టర్ లో.. పవన్ కళ్యాణ్ మాజీ భార్య, యాక్ట్రెస్ రేణు దేశాయ్ నటిస్తున్నట్లు పలు వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

లేటెస్ట్ గా రేణు దేశాయ్.. ఇన్ స్టాగ్రామ్ లైవ్ లో తన అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యారు. ఆమె ఫ్యాన్స్ రేణు దేశాయ్ ని మీరు మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నారా అని ఓ నెటిజన్ అడిగితే, లేదని సమాధానం చెప్పారు. అలాంటి ఆలోచన ఉంటే తానే అధికారికంగా చెప్తానని..రీసెంట్ గా ఓ వెబ్ సిరీస్ లో యాక్ట్ చేసానని.. దానికి సంబంధించిన షూటింగ్ పూర్తయ్యిందని.. త్వరలోనే ఆ వెబ్ సిరీస్ కి సంబంధించిన వివరాలు చెప్తానని అన్నారు. దీంతో పాటు తనకు తెలుగు సినీ ఇండస్ట్రీపై ఎనలేని అభిమానం ఉందని.. అందుకే తెలుగు సినిమాల్లోనే నటిస్తానని.. మరో భారీ ప్రాజెక్ట్ కి సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయని.. త్వరలోనే తన ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటానని అన్నారు.

దేశానికి వెన్నెముకగా నిలిచిన రైతన్నలపై రేణు తీసే సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్, వివరాలు మార్చిలో ప్రారంభం అవుతుందని.. ఆ ప్రాజెక్ట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నానని అన్నారు. అయితే మ‌హేష్ సినిమాలో రేణూ దేశాయ్ క‌నిపిస్తుంద‌ని ఎన్నో ఊహించుకున్న అభిమానుల‌కి ఈ వార్త నిరాశ క‌లిగించింద‌నే చెప్పాలి.