అది సాధించాలనే కోరిక.. వెరైటీ వీడియోపై రేణూ దేశాయ్ కామెంట్

Renu Desai Shared snake And Frog Video

పులి మీద సవారి అనే మాటలు వింటుంటాం. అలాంటివి చేయడం ఎంత ప్రమాద కరమైందో అందరికీ తెలిసిందే. అసలు అలా చేసే వారు ఉంటారా? ఏదో మాట వరసకు..ప్రమాదకరమైన పరిస్థితులను వివరించడానికి అలాంటి మాటలు మాట్లాడుతుంటారు. అయితే పాము మీద కప్ప సవారి అనేది ఎపుడైనా చూశారా? విన్నారా? అసలు అవి రెండు భిన్న జాతులు. పాము కంట కప్ప పడిదంటే ఇక అంతే సంగతులు. ఇవన్నీ ఇప్పుడెందుకు అని ఆలోచిస్తున్నారా?. రేణూ దేశాయ్ తాజాగా ఓ వీడియోను షేర్ చేసింది.

Renu Desai Shared snake And Frog Video
Renu Desai Shared snake And Frog Video

నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రేణూ దేశాయ్.. ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంటుంది. ఒక్కోసారి కవిత్వాలు, ఇంకోసారి ప్రకృతిలోని అద్భుతాలు, వాతావరణ దృశ్యాలను బంధించి సోషల్ మీడియలో షేర్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఆద్య, అకీరా విశేషాలను సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచకుంటూ ఉంటుంది. అయితే తాజాగా ఓ వింత వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోపై చేసిన కామెంట్ తెగ వైరల్ అవుతోంది.

ఆ వీడియోలో ఓ పెద్ద పాము ఉంది. అయితే దానిపై కప్ప జాలీగా, హ్యాపీగా కూర్చుని ముందుకుపోతోంది. అది ఎంత పెద్ద ప్రమాదమో దానికి తెలిసినా కూడా అలాగే ఉంది. కాస్త అటూ ఇటూ అయినా సరే కప్ప గతి అంతే. అయితే అందులో రేణూ దేశాయ్ కప్ప ధైర్యాన్ని, తెగువను చూసినట్టుంది. అలా ప్రమాదాలకు ఎదురునిలబడే తెగువను సాధించాలి, అందుకోవాలని చెప్పుకొచ్చింది. మొత్తానికి ఈ వీడియో మాత్రం ఫుల్ వైరల్ అవుతోంది.