జుట్టు తెల్లగా మారిందంటూ వీడియో షేర్ చేసిన రేణు దేశాయ్.. వీడియో వైరల్!

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ అందరికీ సుపరిచితమే.ఈమె పవన్ కళ్యాణ్ తో కలిసి బద్రి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ ప్రేమలో పడిన రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ ని పెళ్లి చేసుకుని కొన్ని సంవత్సరాలకు పలు వ్యక్తిగత కారణాల వల్ల విడిపోయారు.ఈ విధంగా పవన్ కళ్యాణ్ నుంచి వేరుగా ఉన్న రేణుదేశాయ్ పలు సినిమాలకు డైరెక్టర్ గా వ్యవహరించిన నటిగా మాత్రం తిరిగి ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వలేదు. ఈ క్రమంలోనే తాజాగా ఈమె రవితేజ హీరోగా నటిస్తున్నటువంటి టైగర్ నాగేశ్వరరావు చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటోంది.ఇక ఈ సినిమాలో రేణు దేశాయ్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే షూటింగ్ పనుల నిమిత్తం మేకప్ వేసుకునీ మేకప్ కి సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఈ వీడియోని షేర్ చేసిన రేణు దేశాయ్ తన జుట్టు మొత్తం తెల్లబడిందని తెలియ చేస్తూనే తనకు చాలా సంతోషంగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు. ఈ విధంగా రేణుదేశాయ్ షేర్ చేసిన ఈ వీడియో క్షణాల్లో వైరల్ గా మారింది.

ఈ క్రమంలోనే ఈ వీడియో చూసిన ఎంతో మంది నెటిజన్లు తమదైన శైలిలో రేణు దేశాయ్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా కొందరు ఈ మేకప్ టైగర్ నాగేశ్వరరావు కోసమే కదా మేడమ్ అంటూ కామెంట్లు చేయగా.. మరి కొందరు ఈ సినిమాలో మీ పాత్ర ఏంటి అంటూ ప్రశ్నలు అడుగుతున్నారు.ఇక ఈ సినిమా ద్వారా రేణుదేశాయ్ రీ ఎంట్రీ ఇవ్వడంతో చాలామంది ఈ సినిమాలో ఎలాంటి పాత్రలో సందడి చేయనున్నారనే విషయం తెలుసుకోవడం కోసం ఎంతో ఆతృత కనబరుస్తున్నారు.