రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. సమాజంలోని అసమమానతలు, జరిగే అన్యాయాలు, స్త్రీలపై జరిగే అఘాయిత్యాలు ఇలా ప్రతీ ఒక్క అంశంపై స్పందిస్తూ ఉంటుంది. రేణూ దేశాయ్‌కి సామాజిక అవగాహన కూడా చాలా ఎక్కువ. అందుకే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ప్రశ్నిస్తుంది. సమాజంలో జరిగే వాటిపై స్పృహ ఉంది కాబట్టే రైతులపై సినిమా చేసేందుకు రెడీ అయింది.
రైతుల మీద ఇది వరకే ఎన్నో చిత్రాలు వచ్చాయి. అయినా సరే మరో కొత్త కోణంలో రైతుల సమస్యలను సమాజానికి చూపించేందుకు ఓ కథను సిద్దం చేసుకుంది. గతేడాది ఈ చిత్రం ప్రారంభం కావాల్సింది. కానీ ఆలస్యమవుతూ వచ్చింది. ఇక ఈ ఏడాది కరోనా పూర్తిగా దెబ్బ కొట్టింది. దీంతో చిత్రం మరింత ఆలస్యం కానుంది. ఇందులో రైతుల సమస్యలను ప్రధానంగా చూపించబోతోన్నట్టు తెలుస్తోంది.
అలాంటి రేణూ దేశాయ్ ప్రస్తుతం ప్రకృతిని నాశనం చేస్తోన్న తీరుకు మండిపడింది. పచ్చని చెట్లను నరికి బిల్డింగులు కట్టుకుంటున్నారని వాపోయింది. చూడండి.. చెట్లు, ప్రకృతిని నాశనం చేసి బిల్డింగ్‌లు ఎలా కడుతున్నారో అంటూ తన ఇంటి చుట్టు పక్కల జరగుతున్న వాటిని ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది.