రేణూ దేశాయ్ మంచితనాన్ని, సుతిమెత్తని మనస్తత్వాన్ని తెలుసుకోవడానికి తాజాగా ఆమె షేర్ చేసిన పోస్ట్, పెట్టిన కామెంట్ చూస్తేనే తెలుస్తుంది. రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. కవితలు రాస్తూ తన ఆలోచనలు, మనోభావాలను చెబుతూ ఉంటుంది. అంతేకాకుండా ఆద్య చేసే అల్లరి, అకీరా గురించి విశేషాలు చెబుతూ ఫాలోవర్స్‌కు అప్డేడ్ ఇస్తూ ఉంటుంది.

తాజాగా రేణూ దేశాయ్ తన జుట్టును కత్తిరించుకుంది. మామూలుగా ఆడవాళ్లు జుట్టుకు ఇచ్చే ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కురులను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. సాధారణంగా వారి జుట్టును కత్తిరించుకునేందుకు ఇష్టపడరు. కానీ ఈ మధ్య మోడ్రన్ అంటూ జుట్టును కత్తిరించడం వంటివి చేస్తున్నారనుకోండి అది వేరే విషయం. అయితే రేణూ దేశాయ్ తన జట్టును కత్తిరించుకున్నట్టు తెలిపింది. కానీ అది ఎందుకే తెలిస్తే షాక్ అవుతారు.
క్యాన్సర్ పేషెంట్స్.. స్థోమత లేని వారికి తన జుట్టును దానం చేసినట్టు రేణూ దేశాయ్ పేర్కొంది. క్యాన్సర్ పేషెంట్ కోసం నేను నా జుట్టును కట్ చేసి దానం చేశాను.. అంటూ తన కొత్త హెయిర్ స్టైల్‌ను రేణూ దేశాయ్ షేర్ చేసింది. జట్టును దానం చేయండి.. క్యాన్సర్ పేషెంట్స్ కోసం జుట్టును దానం చేయండి అంటూ రేణూ దేశాయ్ అందరినీ కోరింది. మొత్తానికి రేణు చేసిన పనికి నెటిజన్లు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. రేణూ దేశాయ్ రీసెంట్‌గా తన మొదటి ఫోటో షూట్‌కు సంబంధించిన విశేషాలను చెబుతూ షేర్ చేసిన ఫోటోలు ఎంతగానే వైరల్ అయ్యాయి.
