యాంకర్ సుమనే ఆట పట్టించేసింది.. రేణూ దేశాయ్ మామూల్ది కాదు!!

Renu Desai Counter On Suma

యాంకర్ సుమతో స్క్రీన్ పంచుకున్నా, స్టేజ్ మీద ఎవరైనా ఉన్నా కూడా తన పంచ్‌లతో నోర్మూయిస్తుంటుంది. సమయస్ఫూర్తితో సుమ వేసే కౌంటర్లకు ఎదుటివారు అవాక్కయ్యేలా చేస్తుంది. అలాంటి సుమనే ఇరుకున పెట్టేసింది.. ఆమెను మాట్లాడనివ్వకుండా చేసింది రేణూ దేశాయ్. తాజాగా సుమ ఈట్ టాక్ షోలో రేణూ దేశాయ్‌ను గెస్ట్‌గా ఆహ్వానించింది. మూములుగా అయితే గెస్ట్‌ను పిలిచి వారితో వంటలు వండించి.. ప్రశ్నలతో రోస్ట్ చేస్తుంది సుమ.

Renu Desai Counter On Suma
Renu Desai Counter On Suma

కానీ ఈ సారి మాత్రం రివర్స్ అయ్యేలా కనిపిస్తోంది. ఇది వరకు సుధీర్, ప్రదీప్ వంటి వారిని తీసుకొచ్చి వారిని ఓ రేంజ్‌లో ఆడుకుంది సుమ. అయితే తాజాగా రేణూ దేశాయ్‌తో చేసిన ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది. అందులో రేణూ దేశాయ్ సుమనే ఆడుకుంది. సుమక్క అని పిలిచి ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో ఖంగుతిన్న సుమ.. అలా పిలవొద్దని వేడుకుంది. నేను నిన్ను అక్క అని పిలిస్తేనే మా పిల్లలకు నువ్ పెద్దమ్మవి అవుతావ్ అని సుమకు రేణూ దేశాయ్ కౌంటర్ వేసింది.

ఈ కౌంటర్ కంటే ముందే.. రేణూ దేశాయ్ సుమకు ఓ సెంటిమెంట్ డైలాగ్‌తొ కొట్టిపడేసింది. సుమ పక్కన ఇలా నిల్చోవడం, ఆమెతో ఓ షోలో ఇలా కలిసి కనపడటం, ఇది నిజంగా ఫ్యాన్ మూమెంట్ అంటూ రేణూ దేశాయ్ చెప్పిన మాటలకు సుమ కళ్లు తిరిగిపడిపోయినట్టు చేసేసింది. ఇలా రేణూ దేశాయే సుమను ఆడుకుంది. అయితే చివరకు మాత్రం సుమ ఇచ్చిన గిఫ్ట్‌ను చూసి రేణూ దేశాయ్ కంటతడి పెట్టేసుకుంది. పిల్లలతో ఉన్న ఫోటోను టీ కప్పుపై వేసి ఇచ్చిన గిఫ్ట్‌ను చూసి రేణూ దేశాయ్ ఎమోషనల్ అయింది.