నిత్యం అదే పనిలో.. ఆ మూడ్‌లో ఆద్య!!

Renu Desai About Adya And Netflix,Renu Desai

ప్రస్తుతం పిల్లలు ఇంటి పట్టునే ఖాళీగా ఉంటున్నారు. దాదాపు ఐదారు నెలలు ఇంట్లోనూ ఖాళీగా ఉంటున్నారు. ఈ మధ్య కొంతమందికి ఆన్ లైన్ క్లాసులు కూడా ప్రారంభమయ్యాయి. కొన్ని ప్రైవేట్ స్కూల్స్ ఆన్ లైన్ సిస్టంను స్టార్ట్ చేసేశాయి. అయితే పవన్ కళ్యాణ్ కూతురు ఆద్య ప్రస్తుత మూడ్ గురించి చెబుతూ రేణూ దేశాయ్ ఓ ఫోటోను షేర్ చేసింది.

 Renu Desai About Adya And Netflix,Renu Desai

Renu Desai About Adya And Netflix,Renu Desai

రేణూ దేశాయ్ మామూలుగా రోజుకో పోస్ట్ చేస్తూనే ఉంటుంది. అయితే రేణూ దేశాయ్ షేర్ చేసే ఫోటోల్లో దాదాపు తన పిల్లల గురించే ఉంటాయి. లేదా తన ఫోటోలే అయి ఉంటాయి. అందులోనూ మరీ ముఖ్యంగా ఆద్య తీసినవే ఉంటాయట. ఆద్యకు కెమెరా అన్నా, ఫోటోగ్రఫీ అన్నా ఎంతో ఇష్టమన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆద్య ఫోటోను షేర్ చేయడంతో అందరూ షాక్ అవుతున్నారు.

 Renu Desai About Adya And Netflix,Renu Desai

Renu Desai About Adya And Netflix,Renu Desai

ప్రస్తుతం సెలెబ్రిటీలు వారి పిల్లలు నెట్ ఫ్లిక్స్‌పైనే ఆధారపడుతున్నారు. కొత్త కొత్త సిరీస్‌లో హాలీవుడ్ చిత్రాలను వీక్షిస్తూ సమయాన్ని గడిపేస్తున్నారు. ఆద్య కూడా నిత్యం నెట్ ఫ్లిక్స్‌లోనే మునిగి తేలుతోందట. ఈ మేరకు రేణూ దేశాయ్ ఆద్యకు తెలియకుండా టీవీ చూస్తున్న ఫోటోను షేర్ చేసింది. ఒంటరిగా ఉంది.. నెట్ ఫ్లిక్స్ చూస్తోంది.. అని చెప్పుకొచ్చింది. అయితే ఎంతో తీక్షంగా చూస్తూ ఉండటంతో ఆద్య మొహం వెరైటీ మూడ్‌లో ఉన్నట్టు కనిపించడంతో ఏమైందంటూ అందరూ ప్రశ్నిస్తున్నారు.