రేణూ దేశాయ్ భలే పేరు పెట్టేసింది.. ఆద్య సవారిపై సెటైర్స్!!

రేణూ దేశాయ్, ఆద్యలు సోషల్ మీడియాలో చేసే అల్లరి గురించి అందరికీ తెలిసిందే. రేణూ దేశాయ్, ఆద్యలకు ఇద్దరికీ ఫోటోగ్రఫీ అంటే ఇష్టమే. రేణూ దేశాయ్ షేర్ చేసే ఫోటోలన్నీ ఆద్య తీసినవే. ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్‌గా ఆద్య తీసే ఫోటోలు నెటిజన్లను ఆకట్టుకుంది. తాజాగా రేణూ దేశాయ్ గుర్రాలను పరిశీలించే పనిలో పడింది. అందులో ఓ గుర్రానికి అదిరిపోయే పేరు పెట్టేసింది. అది నిద్రపోతోందని, దాని పేరు రోమియో అని పెట్టేసింది.

Renu Desai ABout Aadya Horse Ride
Renu Desai ABout Aadya Horse Ride

ఇక సగం నిద్రలో ఉన్న రోమియో మీదకు ఆద్య ఎక్కింది. సవారికి సిద్దమైంది కూడా. అయినా ఈ వయసులోనూ ధైర్యంగా సవారి చేసేందుకు ముందుకు వచ్చింది. ఇక ఈ మేరకు ఆద్య పెట్టిన క్యాప్షన్ కూడా అదిరిపోయింది. ఇక ఆ గుర్రంతోరేణూ దేశాయ్ కాసేపు ఆటాడుకుంది. రేణూ దేశాయ్ అడిగిన ప్రశ్నలకు ఆ గుర్రం ఆన్సర్స్ చెప్పిందని, అందుకు అనుగుణంగా తలూపిందని వీడయోను షేర్ చేసింది.

Renu Desai ABout Aadya Horse Ride
Renu Desai ABout Aadya Horse Ride

నిద్రపోయే గుర్రం రోమియోపై ఆద్య ఎక్కడంపై సెటైర్ వేసింది. సవారి మధ్యలో ఉండగానే రోమియో ఇలా నిద్రపోయింది అంటూ సెటైర్ వేసింది. మరి ఈ గుర్రాలను సొంతంగా కొనడానికి వచ్చిందో.. లేదా చూడటానికి వచ్చారో అన్న విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. తన తదుపరి ప్రాజెక్ట్ కోసం ఏదైనా రిహార్సల్స్ చేస్తోందో తెలియాలి. అయితే చిన్నతనంలోనూ ఓ సారి ఆద్య గుర్రపు స్వారీ చేసిన సంగతి తెలిసిందే.