Bigg boss 4: ఎట్టకేలకు నోరు విప్పిన దివి.. ఫైర్ అయిన మిగితా కంటెస్టెంట్లు.. అసలేం జరుగుతోంది హౌస్ లో?

remaining bigg boss contestants fire on divi

దివి తెలుసు కదా.. ఆ తెలుసులెండి.. అప్పుడెప్పుడో బిగ్ బాస్ స్టేజీ మీద నాగార్జునతో మాట్లాడుతుండగా చూశాం. మళ్లీ ఇప్పటి వరకు హౌస్ లో తనను సరిగ్గా చూసింది లేదు. తను మాట్లాడుతుంటే విన్నది లేదు. తన మీద ఎన్నో హోప్స్ పెట్టుకున్నాం. ప్చ్.. అని అనకండి.. ఎందుకంటే దివి మాట్లాడేసింది.

remaining bigg boss contestants fire on divi
remaining bigg boss contestants fire on divi

ఓ మాయా..  ఓ మాయా.. ఈ బిగ్ బాస్ అంటేనే మాయా.. అవును… దివి మాట్లాడేసింది. కానీ.. ఏదో తేడా కొడుతోంది. ఎందుకంటే.. హౌస్ లోకి వచ్చిన మూడు రోజులు అస్సలు నోరే విప్పలేదు దివి. మిగితా కంటెస్టెంట్లతోనూ అంతగా మాట్లాడలేదు. అసలు.. ఎక్కడా కనిపించలేదు కూడా.

ప్రేక్షకులు కూడా దివి ఎక్కడుంది అంటూ వెతుక్కోవడం తప్పితే ఆమె మాత్రం కనిపించలేదు. ఆమె ఒక్కసారి మాట్లాడితే చూద్దాం అని తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఎదురు చూశారు. కానీ.. ఆమె మాత్రం మాట్లాడలేదు. అంతేనా.. సోషల్ మీడియాలో దివి మౌనంపై మీమ్స్, ట్రోల్స్ తెగ ట్రెండింగ్ అవుతున్నాయి.

remaining bigg boss contestants fire on divi
remaining bigg boss contestants fire on divi

అయ్యో… బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ దివి కనిపించడం లేదు.. అంటూ సెటైరికల్ గా పోస్టులు చేస్తున్నారు నెటిజన్లు.

అవన్నీ కట్ చేస్తే.. తాజాగా దివి మాట్లాడేసింది. ఇప్పుడే రిలీజ్ చేసిన ప్రోమో చూస్తే అదే విషయం అర్థం అవుతుంది. ఆమె పెదవి విప్పడమే కాదు.. మిగితా కంటెస్టెంట్లను కడిగేసింది. దీంతో మిగితా కంటెస్టెంట్లు తనతో వాగ్వాదానికి దిగినంత పని చేశారు.

మొనల్ ను పట్టుకొని నువ్వు ప్రతిదానికి ఏడుస్తావు. అలా చిన్న విషయానికి కూడా ఏడుస్తూ కూర్చుంటే చివరకు సీరియస్ విషయం ఉన్నప్పుడు నువ్వు ఏడ్చినా ఎవ్వరూ పట్టించుకోరు అంటూ మొనల్ మొహం మీదనే అనేసింది దివి.

అలాగే అఖిల్ ను, లాస్యను కూడా మీరు ఇలా చేస్తున్నారు.. ఇది కరెక్ట్ కాదు అంటూ ముఖం మీదనే అడిగేసింది. తర్వాత సూర్య కిరణ్ ను కూడా మీరు ప్రతి విషయంలో తలదూర్చుతున్నారు.. అంటూ అనేసరికి.. ఆయన కొంచెం ఆమెపై కోపం ప్రదర్శించారు.

అయ్యబాబోయ్.. హౌస్ లో ఏదేదో జరిగిపోతోంది.. ఇంకా మున్ముందు ఏం జరగబోతున్నాయో ఏమో? ప్రస్తుతానికైతే ఈ ప్రోమో చూసేయండి.

From #Divi point of view...Correct ye antara?? #BiggBossTelugu4 Today at 9:30 PM on #StarMaa