కరోనా వ్యాప్తి.. లాక్ డౌన్ కారణంగా ఆరు నెలలుగా థియేటర్లు మూతబడిన సంగతి తెలిసిందే. గత మార్చ్ లో రిలీజ్ కావాల్సిన సినిమాలు నెలలు లెక్కపెడుతూనే ఆరు నెలలు గడిచాయి. అప్పటికి కొన్ని సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేశారు. కాని ఏ ఒక్క సినిమా కూడా సక్సస్ అన్న టాక్ తెచ్చుకుంది లేదు. ముఖ్యంగా ప్రేక్షకులలో భారి అంచనాలున్న నాని, సుధీర్ బాబు ల వి సినిమా, అనుష్క నటించిన నిశ్శబ్ధం సినిమాల మీద భారీ స్థాయిలో అంచనాలు నెలకొనగా ఆ సినిమాలు ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యాయి.
వాస్తవంగా ఈ సినిమాలు రెండు కూడా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఆసక్తి చూపించలేదు. కాని ఓటీటీ నుంచి వచ్చిన ఆఫర్ టెంప్ట్ చేయడంతో రిలీజ్ చేశారు. ఇక త్వరలో థియోటర్స్ ఓపెన్ అవుతాయని తెలియడంతో రిలీజ్ కి రెడీగా ఉన్న సినిమాల మేకర్స్ ప్రమోషన్స్ కి ప్లాన్ చేస్తున్నారట. సినీ వర్గాల నుంచి తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం థియేటర్స్ ఓపెన్ కాగానే దసరా పండుగ సందర్భంగా మాస్ మహారాజ రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో రూపొందిన ‘క్రాక్’ రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తుంది.
అలాగే మెగా మేల్లుడు వైష్ణవ్ తేజ్ డెబ్యూ సినిమా ‘ఉప్పెన’ దీపావళికి’ విడుదల చేస్తారని సమాచారం. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇక అక్కినేని నాగ చైతన్య – సాయి పల్లవి – శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో తెరకెక్కిన ‘లవ్ స్టోరీ’ క్రిష్టమస్ కానుకగా రిలీజ్ కి సన్నాహాలు చేయనున్నారని, రామ్ పోతినేని నటించిన ‘రెడ్’ 2021 సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ రెడీ అవుతున్నారని అంటున్నారు.
అయితే అసలు విషయం మర్చిపోయారా అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. థియోటర్స్ ఓపెన్ అయినప్పటికి జనాలు ధైర్యంగా వస్తారా.. థియోటర్స్ లో సినిమా రిలీజ్ చేసి అనవసరంగా చేతులు కాల్చుకుంటారా అని మాట్లాడుకుంటున్నారట. రానున్నది శీతాకాలం కావడంతో కరోనా ప్రభావం ఎలా ఉంటుందో అని ఈ రకంగా మాట్లాడుకుంటున్నారట. అయితే అప్పటి వరకు కరోనా దాదాపు కంట్రోల్ లోకి వచ్చేస్తుందని అది కాక అన్ని భద్రల మధ్యనే సినిమాలు థియోటర్స్ లో రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తుంది. చూడాలి మరి ఏ జరగనుందో.