ప్రభాస్ “కల్కి” రిలీజ్ పై క్లారిటీ.. 

ప్యాన్ ఇండియా సినిమా దగ్గర మంచి మార్కెట్ ఉన్న అతి కొద్ది మంది టాలీవుడ్ స్టార్ హీరోస్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఒకడు. మరి ప్రభాస్ హీరోగా చేసిన ఎన్నో చిత్రాల్లో ఇప్పుడు సలార్ వచ్చి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళని కొల్లగొడుతుంది.

కాగా ఈ చిత్రాల్లో ఐతే ఈ సినిమా తర్వాత ప్రభాస్ నుంచి మరిన్ని వరల్డ్ క్లాస్ సినిమాలు వస్తుండగా ఈ చిత్రాల్లో యువ దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న సెన్సేషనల్ చిత్రం “కల్కి 2898ఎడి” కూడా ఒకటి. మరి ఈ సినిమా ఏ లెవెల్లో ఉంటుంది అనేది మేకర్స్ ఇది వరకే చూపించగా ఆ గ్రాండ్ విజువల్స్ అందరి మతి పోగొట్టాయి.

తెలుగు సినిమా నుంచి ఇలాంటి ఒక సినిమాని అయితే తాము చూడలేదు అని టీజర్ చూసాక చాలా మంది చెప్పారు. అయితే అన్నీ పర్ఫెక్ట్ గా ఉండి ఉంటే ఈ జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సిన సినిమా ఇది. కానీ సలార్ లేట్ కావడంతో ఇంత తక్కువ గ్యాప్ లో కరెక్ట్ కాదని విడుదల వాయిదా వేసేసారు.

అయితే ఇపుడు ఈ అవైటెడ్ ప్రాజెక్ట్ రిలీజ్ పై ఓ క్లారిటీ తెలుస్తుంది. ఈ సినిమా రిలీజ్ వచ్చే ఏడాదిలోనే తప్పకుండ ఉంటుంది అని ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది. సినిమా ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిన క్లారిటీ తోనే అయితే ఈ చిత్రం 2024 లోనే రిలీజ్ చేస్తారు అని కన్ఫర్మ్ అయ్యింది. కాకపోతే వచ్చే ఏడాదిలో ఎప్పుడు అనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. సో ప్రభాస్ ఫ్యాన్స్ కి వచ్చే ఏడాది రిలీజ్ ఉంటుందా లేదా అనేది ఎలాంటి టెన్షన్ పెట్టుకోనవసరం లేదు.