షాకింగ్ : హరీష్ శంకర్ వైఖరితో హర్ట్ అయ్యిన హీరోయిన్ రెజీనా..రీజన్ ఇదే.!

టాలీవుడ్ సినిమాపై చాలా మంది హీరోయిన్ ఎప్పటికప్పుడు కొన్ని కంప్లైంట్స్ రైజ్ చేస్తూ ఉంటారు. అయితే చాలా వరకు వారి మాటల్లో నిజం లేకపోకుండా కూడా ఉండదు. ఎందుకు ఉండదు మన వల్ల వైఖరి ఇలా ఉంటే వాళ్ళు అలాగే అందుతారు అని చెప్పాలి. రీ

సెంట్ గానే ప్రముఖ హీరోయిన్ అమలా పాల్ పలు సెన్సేషనల్ కామెంట్స్ తెలుగు సినిమాలపై చేసింది. ఇక లేటెస్ట్ గా అయితే రీసెంట్ గా “శాకినీ డాకిని” తో పలకరించిన యంగ్ హీరోయిన్ రెజీనా కసాండ్ర తన అసహనం వ్యక్తం చేసింది. తెలుగులో తాను చేసిన ఎన్నో సినిమాల్లో తన కెరీర్ స్టార్టింగ్ లో చేసిన చిత్రం “సుబ్రహ్మణ్యం ఫర్ సేల్” కూడా ఒకటి.

మరి ఈ చిత్రం అయితే మంచి విజయాన్నే అందుకుంది. సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించాడు. అయితే లేటెస్ట్ గా ఈ సినిమా రిలీజ్ అయ్యి ఏడేళ్లు కంప్లీట్ చేసుకోవడంతో హరీష్ శంకర్ సినిమాలో అందరిని మెన్షన్ చేసి ఆనందం వ్యక్తం చేసాడు.

ఇదంతా బాగానే ఉంది కానీ హీరోయిన్ రెజీనా పై మాత్రం ఒక్క మాట కూడా చెప్పలేదు. దీనితో దానికి ఆమె రిప్లై ఇస్తూ షాకింగ్ పోస్ట్ చేసింది. మా సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ నుంచి మెన్షన్ చెయ్యడానికి ఇంకే చీటర్ కూడా మిగిలి లేరు, థాంక్స్ హరీష్ సీత లాంటి రోల్ నాకు ఇచ్చినందుకు అంటూ సీరియస్ గా స్పందించింది.

దీనితో మళ్ళీ టాలీవుడ్ అంటే ఇక హీరోలు మాత్రమే అని హీరోయిన్స్ ని ఎవరూ పట్టించుకోరు అని నెటిజన్స్ హరీష్ శంకర్ పై విమర్శలు చేస్తున్నారు.