తన ప్రెగ్నెన్సీ విషయాన్ని బయటపెట్టిన రెజీనా.. అసలు కథ ఇదే?

హీరోయిన్ రెజీనా కసాండ్రా గురించి తెలియని వారు అంటూ ఉండరు. శివ మనసులో శ్రుతి సినిమా ద్వార హీరోయిన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన రెజీనా కొత్తజంట, పిల్ల నువ్వు లేని జీవితం సినిమాల ద్వారా హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది.ఎన్నో తెలుగు, తమిళ్ సినిమాలలో నటించిన రెజినా గత కొంతకాలంగా వెండితెర మీద కనిపించడం లేదు. ఇదిలా ఉండగా ఇటీవల బుల్లితెర మీద సందడి చేసింది. ఈటీవీలో ప్రసారమవుతున్న ఆలీతో సరదాగా అనే షోలో రెజీనా సందడి చేసింది. ఈ షో లో రెజినా తన వ్యక్తిగత విషయాల గురించి కూడా చెప్పుకొచ్చింది.

సాధారణంగా ఎవరు ప్రెగ్నెన్సీ పేరుతో కామెడీలు చేయరు. ముఖ్యంగా హీరోయిన్లు ఇలాంటి విషయాలలో అసలు రిస్క్ చేయరు. ఎందుకంటే ఇలాంటి పరిణామాల వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. కానీ హీరోయిన్ రెజినా మాత్రం తనకు ప్రెగ్నెన్సీ అంటూ ఓ చోట అబద్ధం చెప్పినట్లు తాజాగా ఈ షో లో వెల్లడించింది. ఈ షో లో తన ప్రెగ్నెన్సీ గురించి అలి అడగగా..రెజినా అసలు విషయాన్ని బయటపెట్టింది. గతంలో ఒకసారి బెంగళూర్ లో అర్థరాత్రి 11 గంటల సమయంలో మిస్టీ దోయ్ స్వీట్ కోసం రెజినా తను ప్రెగ్నెంట్ అని అపద్దం చెప్పిందట.

బెంగళూర్ లో ఒకరోజు రాత్రి రెజినాకి స్వీట్ తినాలనిపించిందట. ఆ సమయంలో స్వీట్ షాప్‌కి వెళ్ళి తనకి ఇష్టమైన మిస్టీ దోయ్ స్వీట్ కావాలని అడిగితే షాప్ మూసేసే సమయం అవటంతో స్వీట్ ఇవ్వటానికి కుదరదని స్వీట్ షాప్ ఓనర్ చెప్పాడట. దాంతో రెజినా ఎలాగైనా స్వీట్ తినాలని ‘సార్.. సార్.. నేను ప్రెగ్నెంట్.. నాకు స్వీట్ ఇప్పుడే తినాలని వుంది..’ అని రెజినా అతనిని బతిమాలేసిందట. దాంతో, ఆ షాప్ యజమాని, షాప్ తెరచి స్వీట్ ఇచ్చాడట. ఇలా తన ఫేక్ ప్రెగ్నెన్సీ గురించి రెజినా అసలు విషయం బయటపెట్టింది.