సీడెడ్ లో “సలార్” రికార్డు బిజినెస్..?

ఇప్పుడు పాన్ ఇండియా సినిమా అంతా కూడా ఎంతో ఎగ్జైటింగ్ ఎదురు చూస్తున్న కేవలం కొన్ని చిత్రాల్లో పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న మాసివ్ పాన్ ఇండియా చిత్రం “సలార్” కూడా ఒకటి కాగా దీనిపై నెక్స్ట్ లెవెల్ హైప్ ఇపుడు నెలకొంది.

అయితే ఊహించని విధంగా ఈ సినిమాపై పలు షాకింగ్ రూమర్స్ వైరల్ అవుతుండగా ఈ సినిమా బిజినెస్ కి సంబంధించి అయితే క్రేజీ న్యూస్ లు ఎప్పటికప్పుడు ఆసక్తిగా మారుతున్నాయి. ఇప్పటికే నైజాంలో హక్కులు దిల్ రాజు ఏకంగా 80 కోట్ల మేర వెచ్చించి కొనుగోలు చేసినట్టుగా రూమర్స్ వైరల్ కాగా.

ఇప్పుడు సలార్ సీడెడ్ బిజినెస్ పై క్రేజీ రూమర్స్ వినిపిస్తున్నాయి. కాగా ఈ సినిమా హక్కులు అయితే సీడెడ్ లో ఏకంగా 30 కోట్లు పెట్టి కొన్నారని ఇప్పుడు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇది సీడెడ్ హిస్టరీ లో మరో బిగ్గెస్ట్ డీల్ అట. మొత్తానికి అయితే ఎప్పుడు వచ్చినా కూడా సలార్ మేనియా మాత్రం మాములుగా లేదని చెప్పాలి.

ఇక మిగతా జిల్లాల్లో అయితే ఏపీలో ఏ రేంజ్ బిజినెస్ ఈ చిత్రానికి జరిగిందో మనం ఊహించవచ్చు. ఇప్పటికే తెలుగు స్టేట్స్ ఒక్క బిజినెస్ మాత్రమే 200 కోట్లు ఉండొచ్చని ఒక మరి సలార్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి. ఇంకా ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా జగపతిబాబు, పృథ్వీ రాజ్ సుకుమారన్ లు కీలక పాత్రల్లో నటించగా కేజీఎఫ్ నిర్మాతలు నిర్మాణం వహించారు.