“ఆహా” లో రికార్డులు బ్రేక్ చేస్తున్న పవన్ కళ్యాణ్.!

తెలుగు స్మాల్ స్క్రీన్స్ మరియు ఓటిటి లో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ వచ్చిన మోస్ట్ అవైటెడ్ ఎపిసోడ్ ఆహా లో ప్రసారం అవుతున్న టాక్ షో బాలయ్య హోస్ట్ గా చేస్తున్నటువంటి “అన్ స్టాప్పబుల్ 2” లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కళ్యాణ్ వచ్చిన ఎపిసోడ్ పై భారీ స్థాయి హైప్ నెలకొంది.

దీనితో ఆహా వారు ఎంతో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ పవన్ ఫ్యాన్స్ దెబ్బకి ఆహా క్రాష్ అయ్యిపోయింది కానీ ఉన్న బ్యాక్ అప్ టీం అప్రమత్తం కావడంతో మళ్ళీ యాప్ బాగా పని చేసింది. అయితే ఫైనల్ గా ఈ ఎపిసోడ్ వచ్చిన కొన్ని నిమిషాల్లోనే ఆల్ టైం రికార్డులు సెట్ చేయగా ఇప్పుడు మరో రికార్డు అందుకుంటున్నట్టుగా ఆహా వారు తెలిపారు.

ఈ ఎపిసోడ్ అయితే ఇప్పుడు ఏకంగా 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ని ఆహా లో క్రాస్ చేసేసిందట. దీనితో ఇది ప్రభాస్ ఎపిసోడ్ ని బ్రేక్ చేసి ఫాస్టెస్ట్ రికార్డు నెలకొల్పినట్టుగా ఆహా వారు మరో అదిరిపోయే ప్రోమో తో అనౌన్స్ చేశారు. దీనితో అటు వెండితెర మీద మాత్రమే కాకుండా ఇలా ఓటిటి లో కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రికార్డులు బ్రేక్ చేస్తున్నాడని చెప్పొచ్చు.

కాగా ఈ ఎపిసోడ్ కేవలం మొదటి పార్ట్ మాత్రమే కాగా నెక్స్ట్ పార్ట్ ఈ ఫిబ్రవరి 10న స్ట్రీమింగ్ కి రానుంది. ఇక దానికి ఎలాంటి రికార్డులు నమోదు అవుతాయో చూడాలి.